
పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కోవిడ్- 19 వ్యాక్సినేషన్ "డ్రైరన్" విజయవంతమైంది.నిజ మైన టీకాను ఎలా ఇస్తారో.... అదే పద్ధతిలో నిర్వహించిన ఈ ప్రయోగం సాఫీగా సాగింది.3 అంచెల్లో టీకా ఇవ్వడం, ఆ తర్వాత అరగంట పాటు అబ్జర్వ్ చేయడం, టీకానిల్వ, రవాణా సామర్థ్యం ఈ ప్రక్రియలో కలిగే అవరోధాలను అధికారులు పరిశీలించారు. అలాగే వ్యాక్సిన్ ఇచ్చేముందు ప్రజలు ,ఆరోగ్య సిబ్బంది పాటించాల్సిన అంశాలు ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేలా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణ చికిత్స గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్యాధికారిణి పద్మావతి మాట్లాడుతూ కేంద్రంలోకి టీకా పొందేవారు వచ్చేలా సమీకరించడం, నిబంధనలు పాటిస్తూ నిలబెట్టడం, వారి నుంచి సమాచారాన్ని నమోదు చేయడం వంటి వాటి పట్ల అవగాహన కల్పించామని తెలిపారు. టీకా కోసం వచ్చేవారు. ఏదైనా ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలని సూచించారు.నిజమైన టీకా వేయడం తప్ప అన్ని రకాల ప్రక్రియలను అధికారులు పరిశీలించారు.అలాగే వ్యాక్సిన్ నిల్వచేసిన కేంద్రం నుంచి పంపిణీ కేంద్రాలకు తరలించేందుకు ఎంత సమయం పడుతుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అనేది కూడా గమనించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ కేంద్రంలో 10 మంది ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ -19 డమ్మీ టీకా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు తాసిల్దార్ స్వాతి, ఎంపీడీవో నారాయణరెడ్డి, సి ఐ జి. గంగాధర్ రావు, ఎస్ ఐ కె. రహీమ్ రెడ్డి, వైద్యులు జాయిస్, ఆదర్శ్, ఫార్మసిస్ట్ పి. నరసింహులు, ఏఎన్ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.