YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సోమవారం సీఎంలతో ప్రధాని సమావేశం

సోమవారం సీఎంలతో ప్రధాని సమావేశం

న్యూఢిల్లీ, జనవరి 9, 
భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. సోమవారం 4 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంలో సమావేశం అవుతారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.వ్యాక్సిన్ పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలి దశలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నారు. కొవిడ్ వారియర్స్‌, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు తొలి దశలో టీకా అందజేస్తారు. కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా దేశవ్యా్ప్తంగా 37 స్టోరేజ్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి చేసింది.సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ (ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్), భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి శుక్రవారం దేశవ్యాప్తంగా రెండోసారి డ్రై రన్‌ నిర్వహించా

Related Posts