YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

వ్యాక్సినేషన్ కు సిద్ధం - కలెక్టర్ ఇంతియాజ్

వ్యాక్సినేషన్ కు సిద్ధం -  కలెక్టర్ ఇంతియాజ్

విజయవాడ  జనవరి 12
రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ సామర్థ్యం గల సెంటర్ ను గన్నవరంలో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ చెప్పారు.  గన్నవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వ్యాధి నిరోధక టీకాల నిల్వల కేంద్రంలో ఏర్పాట్ల ను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు . హైదరాబాదు , చెన్నై నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్ వ్యాక్సిన్ రవాణా కాబడుతుందని , గన్నవరం సెంటర్ నుంచి 4 ప్రాంతీయ కేంద్రాలకు వ్యాక్సిన్ రవాణా జరుగుతుందన్నారు . ఇందులో భాగంగా కర్నూలు , కడప , గుంటూరు , విశాఖలో ప్రాంతీయ వ్యాక్సిన్ స్టోరేట్ పాయింట్లు ఏర్పాటయ్యాయన్నారు . రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ రవాణాకు 19 ప్రత్యేక వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు . ప్రతి వాహనంలో 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యలో వ్యాక్సిన్ భద్రపరచేందుకు ఏర్పాట్లు చేశారన్నారు . గన్నవరం రాష్ట్రస్థాయి వ్యాక్సిన్ స్టోరేజ్ పాయింట్ లో 3 వాకిన్ కూలర్స్ , 3 వ్యాక్సిన్ ఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయన్నారు . వీటికి అదనంగా మరో వాకిన్ కూలర్ వ్యాక్సిన్ ఫ్రీజరు వీటిల్లో మైనెస్ 14 డిగ్రీలో వ్యాక్సిన్ భద్రపరచేందుకు అదేవిధంగా 2-8 డిగ్రీల మధ్యలో వ్యాక్సిన్ భద్రపరచేందుకు ఏర్పాట్లు చేశారన్నారు . ప్రతి జిల్లాలో కూడా 100 నుంచి 150 కోల్డ్ చైన్ పాయింట్స్ ఏర్పాటయ్యాయన్నారు . కృష్ణాజిల్లాకు సంబంధించి 3.5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల నిల్వ సామర్ధ్యం చేసుకొనేందుకు మచిలీపట్నంలో జిల్లా స్టోర్స్ అందుబాటులో ఉందన్నారు . అక్కడ నుంచి 145 కోల్డ్ చైన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అక్కడకు 6,525 లీటర్లు వ్యాక్సిన్ రవాణా చేయడం జరుగుతుందని , ఒక్కొక్క లీటరుకు 200 డోసులు పరిమాణం ఉంటుందన్నారు . కరోనా వ్యాక్సిన్ రవాణా స్టోరేజ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు . వ్యాక్సిన్ రవాణా , పంపిణీకి సంబంధించి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు , సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు . వ్యాక్సిన్ పంపిణీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నదని భావిస్తున్నామని అందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు . ఇందుకు 30 సెషన్స్ సైట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . తొలివిడతలో జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ డోసులు అందించడం జరుగుతుందన్నారు . అనంతరం ప్రెంట్ లైన్ వర్కర్స్ అయిన పోలీస్ , పారిశుద్ధ్య సిబ్బంది తదుపరి రెవెన్యూ లోని ప్రెంట్ లైన్ వర్కర్లకు అక్కడ నుంచి ఆ తదుపరి 50 సంవత్సరాలు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందించడం జరుగుతుందన్నారు . వ్యాక్సిన్ వేయడం ప్రారంభించిన రోజు నుంచి ఆయా కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు అవసరమైన ఐస్ ప్యాక్స్ , కోల్డ్ బాక్స్ లు సిద్ధం చేసుకోవడం జరుగుతుందన్నారు .
 

Related Posts