YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

దావూద్‌ అనుచరుడు చింకు అరెస్ట్‌

దావూద్‌ అనుచరుడు చింకు అరెస్ట్‌

ముంబై జనవరి 21 
: అండర్‌ వరల్డ్‌ కింగిపిన్‌ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు పర్వేజ్‌ ఖాన్‌ అలియాస్‌ చింకు పఠాన్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు గురువారం అరెస్ట్ చేసారు.. ఆయన వద్ద నుంచి కోట్ల విలువైన డ్రగ్స్‌తో పాటు ఆయుధాల నిల్వను ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నది. ముంబైలోని పలు స్థావరాలపై దాడులు చేపట్టిన ఎన్సీబీ అధికారులు ఒక డెన్‌ నుంచి చింకు పఠాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయడంలో చింకు ధిట్ట. చింకు గ్యాంగ్ స్టర్ కరీం లాలా బంధువు. కరీం 1960 నుంచి 1980 వరకు చురుకుగా ఉన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారి చింకుపై నార్కోటిక్ డ్రగ్స్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. చింకును అదుపులోకి తీసుకోవడంతో నాలుగు మందుల తయారీ కర్మాగారాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఈ నాలుగు కేంద్రాల నుంచి కోట్ల రూపాయల నగదు, మాదకద్రవ్యాలు, ఆయుధాలను ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుంచి ముంబైలో డ్రగ్స్ మాఫియాపై ఎన్సీబీ చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. చింకుపై చర్య కూడా అందులో భాగమే. అరెస్ట్ తర్వాత చింకును విచారించడంతో డ్రగ్ ప్యాడ్లర్ జునైద్ షేక్ పేరు బయటకు వచ్చింది. దాంతో జునైద్‌ షేక్‌ రహస్య స్థావరాలపై కూడా దాడులు జరిపారు. ముంబైలోని పైధోని ప్రాంతానికి చెందిన మెఫ్డ్రాన్ డ్రగ్స్‌తో జునైద్‌ను ఎన్సీబీ అరెస్టు చేసింది. రూ.30 లక్షల విలువైన నిషేధిత మందులతో 2019 లో డోంగ్రీ పోలీసులు చింకు పఠాన్‌ను అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో చింకుకు స్థానికంగా భారీగా మద్దతు ఉండటం వల్ల పోలీసులు తలనొప్పి ఎదుర్కొన్నారు.

Related Posts