YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జంట హత్యల నేపథ్యంలో ఎవరాకిల్లర్ ...?

జంట హత్యల నేపథ్యంలో ఎవరాకిల్లర్ ...?

మజ్ను ఫిలింస్ పతాకంపై బల్వాన్ ( మాజీ మిస్టర్ ఆంధ్ర ), శ్రావణి హీరో హీరోయిన్లుగా షేక్ సంధానిబాషా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఎవరాకిల్లర్ ... చిత్రం ఈ నెల జనవరి 26న రిపబ్లిక్ డే సందర్బంగా డిజిటల్ ప్లాటుఫామ్స్ అయినా హంగామా, అమెజాన్ , వోడాఫోన్ లలో విడుదలవుతుంది.                          
ఈ సందర్భంగా దర్శక నిర్మాత షేక్ సంధానిబాషా మాట్లాడుతూ... జంట నగరాల్లో జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఒక లేడీ ఇన్సెపెక్టర్ హీరోయిన్ ,ఆమెకు  సహకరించే ప్రవేట్ డిటెక్టీవ్ పాత్రలో హీరో తో కలిసి మర్డర్ మిస్టరీని ఎలా చెదిచారు ఇంతకీ ఎవరాకిల్లర్ ఆ కిల్లర్ని పట్టుకునే క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి అనే సస్పెన్స్ తో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా తెరకెక్కించాం, దీనికి స్వీక్వెల్ గా పార్ట్ 2 కూడా చేస్తున్నామని ఆర్టిస్టులు ,టెక్నిషన్ల వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.                                                                   

హీరో బల్వాన్ మాట్లాడుతూ... మాజీ మిస్టర్ ఆంధ్ర టైటిల్ సాధించిన నేను 47 చిత్రాలలో సోలో ఫైటర్ గా నటించాను ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.      

హీరోయిన్ శ్రావణి మాట్లాడుతూ... ఎన్నో టీవీ సీరియళ్ళలో నటిస్తున్న నన్ను ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు.   ఇంకా అన్నపూర్ణ , గౌతమ్ రాజు ,పావలా శామల, దిల్ రమేష్, జానీ భాష, మిమిక్రి  మూర్తి, శివ సత్యనారాయణ తదితరులు నటిస్తున్న  ఈ చిత్రానికి కెమెరా : జి కె నాయుడు , కథ మాటలు : బల్వాన్ , సంగీతం : రాజేష్ రాజ్ , ఫైట్స్ : కె రాము , సహనిర్మాతలు : విజయశ్రీ , సన్నీ , స్క్రీన్ ప్లై , దర్శకత్వం ,నిర్మాత : షేక్ సంధాని భాషా.

Related Posts