YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

జనరిక్ మందులు వినియోగంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంపొందించండి - ప్రధాన మంత్రి నరేంద్ర మోడి

జనరిక్ మందులు వినియోగంపై  సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంపొందించండి - ప్రధాన మంత్రి నరేంద్ర మోడి

జనరిక్ మందులు వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి  నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.


బుధవారం  ఢిల్లీ నుండి ప్రధాని మోడి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు పై(ప్రగతి) వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కడప,చిత్తూరు జిల్లాల మీదుగా నిర్మించే  కడప-బెంగుళూరు 268 కి.మీ.ల పొడవున నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రగతిని ప్రధాన మంత్రి ఎపి, కర్నాటక సిఎస్ లను అడిగి తెలుసుకున్నారు.అలాగే ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన (PMBJP) పధకం పైన సమీక్షించారు.ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ జనరిక్ మందులు వినియోగంపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. ఇందుకు సంబంధించి సాంకేతికతను కూడా పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పారు.

ఈ జనరిక్ మందులు కేంద్రాలు ఏర్పాటుకు పిహెచ్ సిలు, సిహెచ్ సిలు,సివిల్ ఆసుపత్రుల్లో తగిన అద్దెలేని స్థలాలను కల్పించాలని ప్రధాని ఆదేశించారు.అలాగే కడప-బెంగుళూర్ నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైను నిర్మాణానికి సంబంధించి కడప జిల్లాలో 56.04హెక్టార్ల భూమికి అటవీ క్లియరెన్స్ రావాల్సి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ప్రధాని దృష్టికి తేగా వెంటనే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పారు.విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ కడప-బెంగుళూర్ నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైను నిర్మాణానికి సంబంధించి కడప జిల్లాలో 815హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా 163 హెక్టార్ల సేకరణకు అవార్డు పాస్ చేయగా మిగతా భూసేకరణ వివిధ దశల్లో ఉందని ప్రధానికి వివరించారు.కడప,చిత్తూరు జిల్లాల్లో 56 హెక్టార్ల భూమికి అటవీ అనుమతులు రావాల్సి ఉందని సిఎస్ ఆదిత్యా నాధ్ ప్రధాని దృష్టికి తెచ్చారు.అలాగే ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన పధకం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యంగా జనరిక్ మందులు వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

రాష్ట్రంలో ముఖ్యంగా తిరుపతి స్విమ్స్ మరియు బోర్డ్ ఆసుపత్రులు జనరిక్ మందులు వినియోగంలో మంచి ఫలితాలు సాధించాయని మిగతా అన్ని ఆసుపత్రుల్లో జనరిక్ మందులు వినియోగంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామని సిఎస్ ఆదిత్యా నాధ్ ప్రధానికి వివరించారు.  ఈవీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య,టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శులు అనిల్ కుమార్ సింఘాల్, యం.టి కృష్ణబాబు, సెక్రటరీ సర్వీసెస్ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు

Related Posts