YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

నిలిచిపోయిన డయాలసిస్ సేవలు

నిలిచిపోయిన డయాలసిస్ సేవలు

మెదక్, జనవరి 29, 
రాష్ట్రంలో పలు గవర్నమెంట్ హాస్పిటళ్లలో సోమవారం డయాలసిస్ సర్వీసులు నిలిచిపోయాయి. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆందోళనలకు దిగారు. వెంటనే జీతాలు ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తామని ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చారు. సిబ్బంది ఆందోళనలతో చాలా చోట్ల డయాలసిస్ సెంటర్లు మూతబడ్డాయి. దీంతో రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకునే రోగులు అవస్థలు పడ్డారు.ఆరోగ్యశ్రీలో భాగంగా కిడ్నీ పేషెంట్లకు ఫ్రీగా డయాలసిస్ సేవలను అందించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 40 సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను డీమ్యాడ్, నిప్రో కంపెనీలకు అప్పగించింది. ఈ ఏజెన్సీలు ఒక్కో సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లు, హౌస్కీపింగ్ స్టాఫ్, వార్డ్ ఇన్చార్జి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కలిపి మొత్తం 10 నుంచి15 మంది దాకా నియమించుకున్నాయి. ఒక్కో సెంటర్లో రోజుకు 20 నుంచి 25 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నాయి. ఇందుకుగాను ప్రభుత్వం ఒక్కో డయాలసిస్‍కు రూ.1,375 చొప్పున చెల్లించాలి. కానీ ఈ సెంటర్ల నిర్వహణ చూస్తున్న థర్డ్ పార్టీ ఏజెన్సీలకు గత ఆగస్టు నుంచి ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రెండు సెంటర్లకు ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.రూల్స్ ప్రకారం డయాలైజర్, బ్లడ్ ట్యూబింగ్స్, ఏవీ ఫిస్తులా, ప్రొటెక్టర్లను ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. వీటిని ప్రభుత్వం కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా అందిస్తుంది. అయితే నెల రోజుల నుంచి ఇవి సప్లై కావడం లేదు. స్టాక్ ఉన్న సెంటర్ల నుంచి మిగతా వారు తెప్పించుకుని వాడుతున్నారు. డయాలసిస్ సెంటర్లలో గత 10 రోజులుగా స్టాక్ లేకపోవడంతో పేషెంట్లు బయట  కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.సూర్యాపేట జిల్లాలోని రెండు సెంటర్లలో పని చేస్తున్న 18 మంది స్టాఫ్.. డయాలసిస్ సేవలు నిలిపివేశారు. పదేండ్ల నుంచి పని చేస్తున్నా.. ఏజెన్సీ రూ.10 వేల జీతం మాత్రమే ఇస్తోందని, అది కూడా టైమ్కు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ సెంటర్లలో ఒక్క పర్మినెంట్ టెక్నీషియన్ కూడా లేడని, ఔట్ సౌర్సింగ్ ఎంప్లాయిస్ను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మెరుపు సమ్మెతో రోజంతా డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. ఆఫీసర్లు సర్దిచెప్పడంతో సాయంత్రం తిరిగి సేవలు ప్రారంభించారు.గద్వాలలో స్టాఫ్ అరగంటపాటు నిరసనలు తెలిపారు. పేషెంట్ల ఇబ్బందులు చూడలేక తిరిగి డ్యూటీ చేశారు.కరీంనగర్ డయాలసిస్ సెంటర్ను నిర్వహిస్తున్న డీమెడ్ కంపెనీకి నాలుగు నెలలుగా బిల్లులు రాలేదు. తమకు దాదాపు రూ.48 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని ఏజెన్సీ చెబుతోంది. సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. ఇక్కడ పని చేస్తున్న 12 మంది కూడా సమ్మెకు రెడీ అవుతున్నారు.మంచిర్యాలలో 13 మంది పని చేస్తున్నారు. వీరికి రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు. వచ్చేనెల కూడా జీతాలు రాకుంటే జాబ్స్ మానేస్తామని చెబుతున్నారు.మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. వారికి నచ్చజెపుతూ పనులు చేయిస్తున్నామని ఆఫీసర్లు చెప్తున్నారు.ఆదిలాబాద్లోని రిమ్స్ డయాలిసిస్ సెంటర్ కు ప్రతి నెలా రూ.10 లక్షలు రావాలి. కానీ ఆరు నెలలుగా బడ్జెట్ రావడం లేదు. గత నెల నుంచి అత్యవసర పేషెంట్లకు మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. మరో పది రోజుల్లో బకాయిలు రాకుంటే మెయింటెనెన్స్ కష్టమని అంటున్నారు.భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని డయాలసిస్ స్టాఫ్కు రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదు. సోమవారం ఆందోళన చేపట్టిన స్టాఫ్ వెంటనే శాలరీలు ఇవ్వాలంటూ  ఆస్పత్రి సూపరింటెండెంట్‍కు వినతిపత్రం అందజేశారు.సిద్దిపేట డయాలసిస్ సెంటర్ లో పని చేస్తున్న పది మంది సిబ్బందికి మూడు నెలలుగా శాలరీలు రావడంలేదు. వారు  రెండు గంటలపాటు సేవలను నిలిపివేశారు. మెడికల్ ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో డయాలసిస్ ప్రారంభించారు.

Related Posts