YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

స్కూల్ లో అగ్ని ప్రమాదం

స్కూల్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్, ఫిబ్రవరి 4, 
హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాతబస్తీ గౌలీపురాలోని శ్రీనివాస హైస్కూలులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో తరగతి గదుల్లో మొత్తం 50 మంది పిల్లలు ఉన్నారు. సకాలంలో మంటలు ఆర్పేయడం తో ఎలాటి ప్రాణాపాయం సంభవించలేదు..అందరూ సురక్షితంగా బయట పడ్డారు. ఈ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.స్థానికుల సమాచారం ప్రకారం.. శ్రీనివాస హైస్కూల్‌‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఆఫీసు నుంచి తొలుత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది గమనించిన పాఠశాల సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో పాఠశాలకు సంబంధించిన రికార్డులు, ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమయినట్లు తెలుస్తోంది.

Related Posts