YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాక రేపుతున్న రేవంత్ కామెంట్లు

కాక రేపుతున్న రేవంత్ కామెంట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 5, 
 కమలం కారు పార్టీలు రెండు వేరు వేరు కాదు.. గూళ్లు వేరు అయిన వాలే చెట్టు మాత్రం ఒకటే..  హైదరాబాద్ గల్లీలో కొట్టుకుని ఢిల్లీ వీధుల్లో చేతులు కలుపుకుంటారు..అంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు... ఈ ఆరోపణలకు కమల నాథులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.. కౌంటర్  ఎన్ కౌంటర్ల తో బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.- సమీప కాలంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి... ద్రవిడ గడ్డపై కమలం జెండా పాతాలని ఢిల్లీ పెద్దలు భావించారు. ఇందుకోసం తెలంగాణ గడ్డ నుండి కేంద్రంలో సెంట్రల్ మినిష్టర్ గా కొనసాగుతున్న కిషన్ రెడ్డిని ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు... ఇది మాములే కదా ఇందులో వివాదం ఏముంది.. కిషన్ రెడ్డిని తమిళనాడు కు ఇంచార్జ్ గా నియమిస్తే  కారు పార్టీకి ఏమి సంబంధం..? అందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శలు చేస్తున్నారని అనుకుంటున్నారా..? కారణం ఉంది.. తమిళనాడు ఎన్నికల ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి నియామకం పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి హిట్ పుట్టించే కామెంట్స్ చేశారు... ఈ వ్యాఖ్యలే చర్చకు దారి తీశాయి...  కిషన్ రెడ్డి నియామకం వెనక సీఎం కేసీఆర్ పాత్ర ఉందని రేవంత్ ఆరోపించారు.. కేసీఆర్ గత ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీకి సహకరిస్తానాని ప్రధాని మోడీతో ఒప్పందం కుదుర్చుకున్నారని గతంలోనే విమర్శలు గుప్పించిన రేవంత్, తెలంగాణ నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నిధులు సమకూర్చే బాధ్యతను మోసుకున్నారని వ్యాఖ్యానించారు.. ఒక అడుగు ముందుకేసి తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను తమిళనాడు లో ఉంచి సహకారం అందిస్తున్నారని బాంబ్ పేల్చారు..

మోడీ, కేసీఆర్ మధ్య దోస్తీపై రేవంత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి... ఢిల్లీ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు...   రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ స్టేట్ అఫిషియల్ స్పోక్స్ పర్సన్  కృష్ణసాగర్ రావు ఖండించారు.. కేవలం వార్తల్లో ఉండటానికే కోసమే రేవంత్ రెడ్డి  ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్లుదని చురక అంటించారు... కిషన్ రెడ్డికి పార్టీ అంతర్గత బాధ్యతలు అప్పగించడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో లేని రహస్య ఒప్పందాన్ని ఉన్నట్లుగా ఊహించుకుని వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి పిల్లతనానికి నిదర్శనం. ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ విమర్శించారు.-కిషన్ రెడ్డి తమిళనాడు ఎన్నికల ఇంచార్జ్ గా నియమించడంపై రేవంత్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. మరోవైపు కేసీఆర్ డిల్లీ టూర్ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ముందు రైతులకు మద్దతు ఇచ్చిన కేసీఆర్ అనంతరం మద్దతు విరమించుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ను వ్యతిరేకించినా కేసీఆర్ ఇప్పుడు అమలు చేస్తున్నాడు.. ఈ పరిణామాలపై ఇటు కాంగ్రెస్ నేతలు బీజేపీ టిఆర్ఎస్ జతకట్టాయని  ప్రచారానికి తెర తీశారు.. అవును ఇవన్నీ ఆలోచించదగిన పరిణామాలే.. టిఆర్ఎస్ అధినేత తీరు కూడా ఇప్పుడు మారిన నేపథ్యంలో ఈ వాదనలకు బలం చేకూరులేలా రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి...

Related Posts