YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

రాజమండ్రి ఫిబ్ర‌వ‌రి 05 తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామ మధ్య లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పునాదులతో తగిలించి పడగొట్టిన ఘటన పై మాజీ మంత్రి జవహర్ ఘాటైన విమర్శలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతకు కారణమైన దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని అన్నారు. 13 జిల్లాల్లో వందకుపైగా విధ్వంసాలుసృష్టించడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎన్టీ రామారావు విగ్రహాల కూల్చివేతకు దుండగులుఒడిగడుతున్నారు. ఇప్పటికే రాజనగరం నియోజకవర్గంలోని సిరోముండనం బాధితులకు, న్యాయం చేయడంలో ప్రభుత్వంవిఫలమైందన్నారు.శిరోమునండనం  సంఘటనకు కారణమైన కవల కృష్ణమూర్తిపైఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్టీ రామారావు విగ్రహం కూల్చివేతకుకారణమైన దుండగులను శిక్షించక పోతే, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడానికి ఎన్టీరామారావు అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ గత 20నెలలుగా మొదట దేవుని విగ్రహాల కూల్చివేత కార్యక్రమాలు అయిపోయ్యాక, ఇప్పుడు  స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహాల కూల్చివేత కార్యక్రమంలో భాగంగా దోసకాగ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని ఖండిస్తున్నా మని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు, మార్ని రాము, మార్నినాని, కర్రి రాజు, పిల్లల దేవి ప్రసాద్, గొంప శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ నాగ రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు

Related Posts