YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

ఫస్ట్ టెస్ట్ లో జోరుగా ఇంగ్లండ్

ఫస్ట్ టెస్ట్ లో జోరుగా ఇంగ్లండ్

చెన్నై, ఫిబ్రవరి 5, 
భారత్‌తో చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు. 164 బంతుల్లో 12 ఫోర్లు బాదిన జో రూట్ 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న జో రూట్‌‌కి ఇది 20వ శతకం. దాంతో.. 78 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ టీమ్ 227/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది.
ఇంగ్లాండ్ స్కోరు 63/2తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన జో రూట్ తొలుత ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్ల బౌలింగ్‌లో వరుసగా స్వీప్ షాట్లు ఆడుతూ జోరందుకున్న ఈ ఇంగ్లాండ్ కెప్టెన్.. బ్యాట్ ఫుట్‌ పైకి వెళ్లి కట్ షాట్‌లతోనూ అదరగొట్టేశాడు. ఈ క్రమంలో ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (83: 250 బంతుల్లో 12x4)తో కలిసి మూడో వికెట్‌కి 164 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని రూట్ నెలకొల్పాడు. శ్రీలంకతో జనవరిలో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ జోరూట్ ఒక డబుల్ సెంచరీ, ఒక భారీ శతకం నమోదు చేశాడు. తొలి టెస్టులో 228 పరుగులు చేసిన జోరూట్.. రెండో టెస్టులోనూ 186 పరుగులు చేసిన విషయం తెలిసిందే.టెస్టు క్రికెట్‌లో 100వ టెస్టులో ఇప్పటి వరకూ కేవలం 8 మంది బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే సెంచరీలు నమోదు చేయగా.. తాజాగా 9వ క్రికెటర్‌గా జో రూట్ నిలిచాడు. కోలిన్ కౌడ్రీ, జావెద్ మియాందాద్, గోర్డాన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టీవర్ట్, ఇంజిమామ్ ఉల్ హక్, రిక్కీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, హసీమ్ ఆమ్లా మాత్రమే ఈ ఘనత సాధించాడు.

Related Posts