
పోలీసులకు కోవిడ్ వ్యాక్సిన్
మల్కాజిగిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్
ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భాగవత్
మొదట కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న సిపి
హైదరాబాద్ ఫిబ్రవరి 6,
మల్కాజిగిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులకు కోవిషీల్డ్ వాక్సీన్ ఇవ్వడం ప్రారంభమైంది. రాచకొండ సిపి మహేష్ భాగవత్ మొదటి వ్యాక్సీన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మాట్లాడుతూ రాచకొండ కమీష్నరేట్ పరిధిలో 49 సెంటర్స్ లో సుమారు 12వేల సిబ్బందికి వ్యాక్సిన్ తీసుకుంటునట్లు తెలిపారు. ఎవరూ కూడా భయాంధోళన చెందవద్దని, వ్యాక్సీన్ తీసుకున్నా కూడా సోషన్ డిస్టెన్స్ తప్పక పాటించాలని సూచించారు.