YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 21 వరకు ఇంటికే పెద్దిరెడ్డి

ఈ నెల 21 వరకు ఇంటికే పెద్దిరెడ్డి

21 వరకు ఇంటికే పెద్దిరెడ్డి
విజయవాడ, ఫిబ్రవరి 6
ఏపీ ఎస్ఈసీ సంచలన ఆదేశాలు ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని.. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.. 
అలాగే మంత్రికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలోశాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని డిజిపి కి రాసిన లేఖలో పేర్కొన్నారు. 
తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను జతచేశారు.. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకే ఈ చర్యలని ఎస్ఈసీ తెలియజేయడం సంచలనంగా మారింది.మంత్రిపై ఎస్ఈసీ జారీ చేసి ఆర్డర్స్మంత్రిపై ఎస్ఈసీ జారీ 
చేసి ఆర్డర్స్పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ చర్యలు ప్రారంభించారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని ఏకపక్షంగా 
వ్యవహరించే అధికారులను.. తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని మంత్రి అన్నారు. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం’ అని 
పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు

Related Posts