YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆస్తి-పాస్తులు తెలంగాణ

20 లక్షలతో గంగవ్వ ఇల్లు

20 లక్షలతో గంగవ్వ ఇల్లు

20 లక్షలతో గంగవ్వ ఇల్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 9, 
బిగ్ బాస్ అన్ని సీజన్ లోకెల్లా సీజన్ 4కే చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటారా ఆ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరికీ లాభమే వచ్చింది పలు ఆఫర్స్ ద్వారా. అప్పటి వరకు తెలియని వారు కూడా ఈ షో ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఆ షోలో పాల్గొనకముందే యూట్యూబ్ ద్వారా గంగవ్వ చాలా ఫేమస్ అయింది. బిగ్ బాస్ షోతో తెలియని వారికి సైతం తెలిసిపోయింది. మై విలేజ్ షోతో బాగా పాపులర్ గంగవ్వ. మై విలేజ్ షో తో బాగా పాపులర్ అయింది. 60ఏళ్ళ వయసులో ఈమెకు వచ్చిన ఆఫర్ ని చూసి అంతా షాక్ అయ్యారు. ఈ  వయసులో బిగ్ బాస్ కు వెళ్లి గంగవ్వ ఏం చేస్తుంది.. ఎందుకు సెలెక్ట్ చేసారబ్బా అంటూ అంతా విమర్శించారు.కాగా  అక్కడున్న పరిస్థితులకు గంగవ్వ  ఎప్పుడు అలవాటు పడుతుంది..అక్కడ ఫిజికల్ టాస్కులు ఎలా చేస్తుందంటూ ప్రశ్నించారు. ఎవరెన్ని చెప్పినా గంగవ్వ మాత్రం చాలా నమ్మకంగా కనిపించారు. తాను టైటిల్ గెలిచి వస్తానని చెప్పింది. ఉన్నన్ని రోజులు హాయిగా ఉంటానని చెప్పింది గంగవ్వ. అయితే మధ్యలో అనారోగ్యం పాలై బయటికి వచ్చేసింది పాపం. కానీ తాను ఇంట్లోకి వెళ్లడానికి కారణం మాత్రం సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసమే అని చెప్పింది గంగవ్వ. అనుకున్నట్లుగానే ఇప్పుడు పూర్తి చేసుకుంటుంది. కల నెరవేర్చుకుంటుంది అవ్వ. దానికి బిగ్ బాస్ టీంతో పాటు నాగార్జున కూడా సాయం చేసాడు.గంగవ్వ వచ్చిన కారణం సరైంది కావడంతో అక్కడ వచ్చిన డబ్బులే కాకుండా మరిన్ని కూడా జోడించి ఇచ్చాడు టాలీవుడ్ హీరో  నాగార్జున. బిగ్ బాస్ నుంచి గంగవ్వకు  దాదాపు 5 లక్షలకు పైగానే వచ్చాయి. దాంతో పాటు నాగార్జున 7 లక్షలు ఇచ్చాడు.. ఇక బిగ్ బాస్ కూడా ప్రత్యేకంగా 10 లక్షలు ఇచ్చాడు. అలా 20 లక్షలకు పైగానే పెట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది గంగవ్వ. దీనికి నిర్మాణం కూడా పూర్తైపోయింది. తన ఇంట్లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టారు గంగవ్వ టీం. ఎంతైనా బలమైన కారణం ఉన్నపుడు.. మంచి పని కోసం కదిలినపుడు పరిస్థితులు కూడా అలాగే కలిసొస్తాయని గంగవ్వను చూస్తుంటే అర్థమైపోతుంది. మొత్తానికి గంగవ్వ ఇంటి కల బిగ్ బాస్ వల్ల నెరవేరింది.

Related Posts