YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పేకాట ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

పేకాట ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

రామగుండం  ఫిబ్రవరి 10, తాండూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో  గుట్టుచప్పుడు కాకుండా పేకాట(అందర్-బహార్) ఆడిస్తున్న ఈ ముఠా గుట్టును  టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు రట్టుచేసారుజ  మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా రహస్య ప్రదేశాలను గుర్తించి పేకాట ఆడిస్తున్నారని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపల్లివాడ గ్రామ ప్రాంతంలో   డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నరనే నమ్మదగిన సమాచారం అందుకున్న గుట్టు టాస్క్ ఫోర్స్ &  తాండూర్ పోలీసులు సంయుక్తంగా  దాడి నిర్వహించగా 57 మందిని పోలీసులు పట్టుకోవడం జరిగింది.ఒక్కరు పరారీలో ఉన్నాడు అని  సీపీ సత్యనారాయణ తెలిపారు.
 ఈ సందర్బంగా సీపీ తెలంగాణా రాష్ట్రము ఏర్పడిన తరువాత ప్రభుత్వం లా & ఆర్డర్ కి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదాన్ని మోపి అన్ని క్లబ్లను అరికట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు మూతపడ్డాయి.తెలంగాణా లో ఆడడం వీలు కాదని పోలిసుల నిఘా ఎక్కవ ఉండడంతో ఈ పేకాట రాకెట్ కీలక సూత్రధారులు అనుగొండ సుదర్శన్,, మాదారపు రామారావు , మాదారపు విజయ్, మహేందర్ రావు లు పేకాట రాయుళ్ళ వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి అందులో సందేశాలు పంపిస్తూ వారికీ పేకాట అడే ప్రాంతాన్ని  తెలియచేస్తారు .వీరు మహారాష్ట్ర లోని రాజురా ,బెంగుళూరు,చతిష్ఘడ్ లోని కుంట ,చంద్రపూర్ ...మొదలగు  ప్రాంతలకు వాహనాలు ఏర్పాటు  చేసి పేకాట ఆడు ప్రాంతాలకు తీసుకెల్తారు.డ్రైవర్స్ కి డబ్బులు చేలిస్తూ ఆడడానికి వచ్చిన పేకాట రాయుళ్లకి బిర్యానీలు మద్యం ఏర్పాటు చేస్తారని అన్నారు.

Related Posts