YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రేమ పెళ్లి చేసుకున్న నెలకే విషాదం..  తండ్రికి ఫోన్... కొద్దిసేపటికే దారుణం

ప్రేమ పెళ్లి చేసుకున్న నెలకే విషాదం..  తండ్రికి ఫోన్... కొద్దిసేపటికే దారుణం

ప్రేమ పెళ్లి చేసుకున్న నెలకే విషాదం.. 
తండ్రికి ఫోన్... కొద్దిసేపటికే దారుణం
గుంటూరు  ఫిబ్రవరి 10 
మనసులు కలిసాయి.  కానీ మతం వేరుచేసింది.  ఇద్దరూ ప్రేమించుకున్నారు.  తరువాత పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించరన్న అనుమానంతో తనువులు చాలించాలనుకున్నారు. కూల్ డ్రింక్ లో విషం కలుపుకున్నారు.  తాగి ఆత్మహత్యాయత్నం చేసారు. ఘటనలో భర్త మరణించాడు. భార్య పరిస్థితి విషమంగా మారింది. ఉండవల్లి గృహాలు వెనకాల కొండపైన ఓ జంట ఆత్మహత్య ప్రయత్నం ఘటన వెనుక ఈ విషాదం దాగింఉది.  యువకుడు వెండి దిండి పృథ్వి  ప్రకాశం జిల్లా హనుమంతులపాడు మండలంలోని చిన్నముప్పాళ్లపాడుకు  గ్రామం వాసి గా గుర్తించారు. పృథ్వి   గతంలో తెనాలి, విజయవాడ ప్రాంతాల్లో పండ్ల వ్యాపారం చేశారు. తరువాత హైదరాబాద్ కు వెళ్లి జవహర్ నగర్ లో వ్యాపారం ప్రారంభించాడు.  అక్కడ  ఫర్హానా పరిచయం అయింది. తరువాత పరిచయం కాస్తా ప్రేమగా మారింది.  జనవరిలో ఇద్దరూ కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కూతురు  కనిపించడంలేదని ఫర్హానా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
మంగళవారం సాయంత్రం చిన్నముప్పాళ్లపాడులోని తండ్రికి పృథ్వీ ఫోన్ చేసి తాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని.. కోడలును ఇంటికి తెస్తున్నానని చెప్పారు. పృథ్వీ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. పల్లెటూరిలో ఆమెను తీసుకొస్తే పరువుపోతుందన్నట్లు కుమారుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మరోవైపు పృథ్వీతో ఘర్షాన వెళ్లినట్లు గుర్తించిన ఆమె బంధువులు చిన్నముప్పాళ్లపాడు చేరుకుని ఆరా తీశారు.   
పృథ్వీ, ఫర్హానాలు మంగళవారం ఉండవల్లి గుహల సమీపంలోని కొండపైకి వెళ్లారు. వారిని చూసిన అక్కడున్న కొందరు పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు...ఈ జంట ఎంతసేపటికి కిందకు రాకపోవడంతో అనుమానంతో స్థానికులు కొండపైకి వెళ్లి చూశారు.  వారిద్దరూ ఇద్దరు నురగలు కక్కుతూ పడి ఉండటం చూశారు.  వెంటనే పోలీసులకు, 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చి ఇద్దరిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.   అప్పటికే పృథ్వీ చనిపోగా.. యువతి అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు కొండ పైనుంచి మోసుకొచ్చి అంబులెన్స్ లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు మృతుడి జేబులో ఫోన్ నంబర్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను గుర్తించారు. వాటి సాయంతో చిన్నముప్పాళ్లపాడులోని అతని తండ్రి గోపాలరెడ్డికి సమాచారం ఇచ్చారు. తనకు ఫోన్ చేసిన రెండు గంటల తర్వాత కొడుకు చనిపోయినట్లు తెలుసుకొని గోపాలరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఫర్హాన కాళ్లకు మెట్టెలు ఉన్నాయని, ఇరువురూ పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు  భావిస్తున్నారు.

Related Posts