YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జనాభా ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు పెంచాలి

జనాభా ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు పెంచాలి

జనాభా ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు పెంచాలి
అవసరమయితే రాజ్యాంగాన్ని సవరించాలి ప్రధానికి ఆర్కె లేఖ
హైదరాబాద్ ఫిబ్రవరి 10

అగ్ర కులాల జనాభా 9 శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్లు కల్పించారని, కానీ బీసీలు జాతీయ స్థాయిలో 56 శాతం ఉంటే 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయమా? అందుకే బిసిలకు  కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లను 27 శాతం నుండి 56 శాతంకు పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు.రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకంగా అగ్రకులాలోని పేదల పేరు మీద  పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఒకే రోజులో లోక్ సభలో-మరో రోజు రాజ్యసభలో రికార్డు స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇడబ్లుఎస్ రిజర్వేషన్ బిల్లు పాస్ చేశారు. జాతీయస్థాయిలో ఈ రిజర్వేషన్లను కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. కానీ కొన్ని వందల- వేల సంవత్సరాలు సామాజిక వివక్షకు గురవుతూ విద్యకు నోచుకోని కడు పేదరికంలో నివసిస్తున్న బీసీలకు రిజర్వేషన్లు పెట్టడానికి 45 సంవత్సరాలు పట్టింది. అది కూడా 56 శాతం జనాభా ఉంటే కేవలం 27 శాతం రిజర్వేషన్లు పెట్టారు. ఇటివల సేకరించిన గణాంకాల ప్రకారం కేంద్ర స్థాయిలో బి.సి ఉద్యోగుల సంఖ్య 16 శాతం దాటలేదని పేర్కొన్నారు. ఎలాగు జనాభా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలకు కూడా విద్య, ఉద్యోగాలలో 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలి. అలాగే స్థానిక సంస్థలలోని రిజర్వేషన్లు జనాభా ప్రకారం 56 శాతం పెట్టె విధంగా రాజ్యాంగాన్ని సవరించాలి. అలాగే బీసీలకు చట్టసభల్లో అసెంబ్లీ-పార్లమెంటు ఎన్నికలలో కూడా 56 శాతం రిజర్వేషన్లు పెట్టాలి. ప్రైవేటు రంగంలో కూడా ఎస్సీ,ఎస్టీ, బిసి రిజర్వేషన్ల పెట్టాలి. అలాగే హైకోర్టు-సుప్రీంకోర్టు జడ్జిలనియమకలలో కూడా  ఎస్సీ,ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కోరారు.

Related Posts