YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

అయోధ్య రామ మందిర నిర్మాణానికి అందరి సహకారం అభినందనీయం బిజెపి నేత కరణం భాస్కర్

అయోధ్య రామ మందిర నిర్మాణానికి అందరి సహకారం అభినందనీయం బిజెపి నేత కరణం భాస్కర్

అయోధ్య రామ మందిర నిర్మాణానికి అందరి సహకారం అభినందనీయం
బిజెపి నేత కరణం భాస్కర్
నెల్లూరు ఫిబ్రవరి 10
అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి సహకరిస్తున్న వారందరికీ బిజెపి నేత కరణం భాస్కర్ అభినందనలు తెలియజేశారు.  అయోధ్య రామమందిర నిర్మాణం కొరకు నిధి సమర్పణలో భాగంగా కొంతమంది స్థితిమంతులను  కలుస్తుంటే ,మేము ఊహించినదానికన్న   వాళ్ళు రామభక్తిని చాటుకొంటు నిధి సమర్పణ చెక్కుల ద్వారా చెల్లిస్తూ శ్రీరామ భక్తిని చాటు  కొంటున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  విరాళాలు సేకరణ లో భాగంగా మేము సందర్శించిన ప్రాంతాలలో  , ప్రజలలో శ్రీరామునిపట్ల ఎంత భక్తి భావం ఉందొ అర్ధమవుతుంది అని అన్నారు . హిందూమత  సాంప్రదాయం తో పాటు, భారతీయ సంస్కృతిని వెల్లివిరిసేలా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందన్నారు. ఈసందర్భంగా రామమందిర నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పై కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగరాజా రెడ్డి, రామిరెడ్డి, నంద గోపాల్ రెడ్డి,అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts