YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

అస్సోంలో 5 రూపాయిలు పెట్రోలు

అస్సోంలో 5 రూపాయిలు పెట్రోలు

అస్సోంలో 5 రూపాయిలు పెట్రోలు
డిస్ పూర్, ఫిబ్రవరి 12,
మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. పెట్రోల్, డీజిల్, మద్యం ధరలపై అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.5, మద్యంపై 25 శాతం సుంకం తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. తగ్గించిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అసోం ఆర్ధిక మంత్రి హిమాంత బిశ్వాస్ శర్మ అసెంబ్లీలో ప్రకటన చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్న వేళ అసోం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట లభించినట్టయ్యింది.అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. ‘స్పీకర్ సార్.. కోవిడ్-19 వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సుంకం విధించాం.. ప్రస్తుతం కరోనా బాధితులు, కేసులు గణనీయంగా తగ్గాయి.. అదనపు సుంకాన్ని రద్దుచేయడానికి తాను చేసిన ప్రతిపాదనలకు నా క్యాబినెట్ సహచరులు అంగీకరించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను.. పెట్రోల్, డీజిల్‌పై రూ.5 తగ్గించాం.. ఇది శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది.. అసోంలో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది’ అని అన్నారు.ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్‌ను బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ ముందుంచింది. ఆరు నెలల కాలానికి మొత్తం రూ.69,784.03 కోట్లు బడ్జెట్‌ను ప్రతిపాదించింది. జనవరి 6 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని అంటడంతో దేశంలోనూ డీజిల్, పెట్రోల్ ధరలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి.కాగా, మార్చి-ఏప్రిల్‌లో అసోం శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. అటు కేంద్ర బడ్జెట్‌లోనూ అసోంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భారీగానే నిధులు కేటాయించింది. ఎన్నికలు జరగనున్న పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలలో జాతీయ రహదారి కారిడార్ల నిర్మాణానికి లక్షల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

Related Posts