YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

‘‘సురాపానం’’ మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ

‘‘సురాపానం’’ మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ

అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన "సురాపానం " మూవీ టైటిల్ లోగో ఆవిష్కరణ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా.. రవీంద్రభారతి పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సందర్బంగా దర్శకుడు సంపంత్ కుమార్ మాట్లాడుతూ.. సురాపానం మూవీ కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని, ఒక విభిన్నమైన సరికొత్త కథాంశంతో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ ఆనందాన్ని, ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రొడ్యూసర్ మట్ట మధు యాదవ్ మాట్లాడుతూ.. కథ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, సినిమా ఖచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు.
సంపత్ కుమార్, ప్రగ్య నయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ అఖిల్, సీనియర్ నటులు సూర్య, అజయ్ ఘోష్, ఫిష్ వెంకట్, మీసాల లక్ష్మణ్, విద్యాసాగర్, అంజి బాబు, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు, జెన్నీ, గిరి పోతరాజు తదితరులు నటించారు.

Related Posts