
అమరావతి
అమరావతి సచివాలయంలో సర్ ఆర్థర్ కాటన్ వర్దంతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గోని నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ ఆనాడు ఆంగ్లేయుడైన ఆర్ధర్ కాటన్ ముందు చూపుతో ధవళేశ్వరం ఆనకట్ట తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు,కృష్ణా ఆనకట్టకు కృషి చేసిన మహానుభావుడని అన్నారు.
గత జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ శాఖ విధ్వంశంతో కాటన్ దొర ఆత్మసైతం క్షోభిస్తోంది. విధ్వంశానికి గురైన పోలవరం ప్రాజెక్టుతో పాటు, ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారు. కాటన్ మహాశయుడి స్పూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు చంద్రబాబు. నదుల అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పనిచేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు సాగు, త్రాగునీరు అందించనున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పంట కాలవలు, మురుగు డ్రైన్ల మెయింటినెన్స్ పనులకు రూ 700 కోట్లను కేటాయించి సాగునీరు సక్రమంగా అందిస్తున్నామని అన్నారు.