YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

బాసరలో భక్తుల సందడి.. వైభవంగా వసంత పంచమి వేడుకలు

బాసరలో భక్తుల సందడి.. వైభవంగా వసంత పంచమి వేడుకలు

బాసరలో భక్తుల సందడి.. వైభవంగా వసంత పంచమి వేడుకలు
బాసర సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ ఫిబ్రవరి 16, 
ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఆలయ అధికారులు  తదిరులు ఉన్నారు.

Related Posts