YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మృత్యుంజయ హోమంలో పాల్గొన్న భక్తులు

 ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మృత్యుంజయ హోమంలో పాల్గొన్న భక్తులు

 ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
మృత్యుంజయ హోమంలో పాల్గొన్న భక్తులు

కర్నూల్  ఫిబ్రవరి 17,
కర్నూలు నగరంలోని పవిత్ర తుంగభద్రా తీరంలో సంకల్ బాగ్ హరిహర క్షేత్రంలో వెలసిన కలియుగ బ్రహ్మాండ నాయకుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 15 వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం మృత్యుంజయ ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ హోమం లో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు అయ్యారు. హోమంలో పాల్గొన్న భక్తులు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వుంటారని నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కళ్లె చంద్రశేఖర శర్మ తెలిపారు. శుక్రవారం సప్తమి రోజున సూర్యప్రభవాహనం ఉంటుందని అన్నారు. అదే  రోజు అరుణ హోమం ఉంటుందని ఈ హోమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని తరించాలి అన్నారు. శనివారం అష్టమి రోజున స్వామివారికి అశ్వవాహన సేవ ధన్వంతరి హోమం ఉంటుందన్నారు. ఆదివారం నవమి నాడు శ్రీ వేంకటేశ్వర స్వామిని హంస వాహనంపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. రుద్ర దుర్గా సకలదేవతా హోమం ఉంటుందని తెలిపారు. సోమవారం దశమి రోజు పంచ సూక్తం హోమం తరువాత దివ్యమంగళ రథోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు కళ్యాణ సేవ, విశేష హోమముల సేవ, ఉదయాస్తమాన సేవలు వస్త్రాలంకరణ సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ విశేష పూజలు లో భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. 

Related Posts