YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

అంగన్వాడీ ల నిర్వాహణ పై మంత్రి సత్యవతి రివ్యూ

అంగన్వాడీ ల నిర్వాహణ పై మంత్రి సత్యవతి రివ్యూ

అంగన్వాడీ ల నిర్వాహణ పై మంత్రి సత్యవతి రివ్యూ
మంచిర్యాల ఫిబ్రవరి 19 
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, పప్పులు, నూనెలు, నిత్యావసరాలు క్రమం తప్పకుండా... నాణ్యత లోపించకుండా సరఫరా చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ -  శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ గారు తెలిపారు. అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు 50 గ్రాముల కంటే తక్కువ ఉండొద్దని నిబంధన పెట్టామని, చిన్న గుడ్లను సరఫరా చేస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేసి, అధికారులను బాధ్యులు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాకే గిరిజన సంప్రదాయాలకు, పండగలకు, జాతర్లకు ప్రాధాన్యత లభించిందని సీఎం కెసిఆర్ నాయకత్వంలోనే అధికారికంగా జాతరలు నిర్వహించేందుకు నిధులు కేటాయిస్తున్నారని, గతంలో ఏ పాలకులు కూడా గిరిజనులు పట్టించుకోలేదని మంత్రి అన్నారు.
మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, మహిళాభివృద్ది - శిశు సంక్షేమ శాఖల సమీక్షా సమావేశం నస్పుర్ అతిధి గృహంలో నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో నూతన అంగన్వాడిలలో సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు పంపించండి.  అంగన్వాడీలకు వచ్చే పాలను విజయ డైరీ నుంచి తీసుకుంటున్నాం. ఇకపై సమస్యలు రాకుండా సరఫరా జరుగుతుంది. గుడ్ల సరఫరా నెక్(నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ) ద్వారా సరఫరా చేస్తున్నాం. నెక్ కు స్థానిక వ్యవసాయదారులు(గుడ్ల ఉత్పత్తి దారులు) పంపిణీ చేస్తారు. చిన్న గుడ్లు కేంద్రాలకు పంపించకుండా కచ్చితంగా 50 గ్రాములకు తగ్గకుండా ఇవ్వాలని ఆదేశించామని అన్నారు.
చిన్న గుడ్లు వస్తె వెంటనే ఆ కాంట్రాక్టర్స్ ను బ్లాక్ లిస్ట్ చేయండి. సీ డి పి ఓ లను బాధ్యులం చేస్తాము. దీనిని సరిగా పర్యవేక్షించేందుకు కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ కు బాధ్యతలు ఇవ్వండి.  గుడ్ల కోసం మనం కాంట్రాక్టర్స్ కు మార్కెట్ ధర చెల్లిస్తూ వారికి అన్ని సదుపాయాలు ఇస్తున్నాం. కాబట్టి చిన్న పిల్లలకి ఇచ్చే గుడ్ల విషయంలో రాజీ పడేది లేదని అన్నారు. 
చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఇచ్చే గుడ్లలో కూడా వ్యాపార ధోరణి ఉండొద్దు...మానవత్వంతో పని చేయాలని కాంట్రాక్టర్స్ కు చెప్పాము. ప్రతి రోజు క్రమం తప్పకుండా  గుడ్లు ఇవ్వాలని అవి కూడా 50 గ్రాముల కు తగ్గకుండా ఇవ్వాలని చెప్పాము. వారు అంగీకరించారు. ఇందులో ఈ మాత్రం తేడా ఉన్నా అధికారులు బాధ్యులను చేసి కాంట్రాక్టర్స్ ను బ్లాక్ లిస్ట్ చేస్తాం. అంగన్వాడిలలో  ఖాళీలు ఎన్ని ఉన్నాయి..కొత్త నియామకాల ప్రతిపాదనలు వెంటనే పంపించండి. పిల్లల్లో పోషకాహార లోపం ఉందని ఒక సర్వే ద్వారా చెప్పడంతో సీఎం కేసిఆర్  ఈ లోపాన్ని నివారించాలని ఆదేశించారు. దీన్ని నివారించేందుకు అధ్యయనం చేస్తున్నాం. త్వరలో పిల్లలకు కూడా పాలు ఇచ్చే ఆలోచన ఉంది, పిల్లల పెరుగుదలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసే విధంగా గ్రోత్ మానిటర్ కార్డ్స్ ఇస్తున్నాం. మిల్లెట్స్ బ్రేక్ ఫాస్ట్, చిక్కీలు ఇచ్చే ఆలోచన కూడా ఉంది. దేశంలో ఎక్కడా లేని మంచి పథకం ఆరోగ్య లక్ష్మిని మన దగ్గర సీఎం కేసిఆర్  ఎంతో మనసు పెట్టి తీసుకొచ్చారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు.
గత రెండేళ్లలో గిరి వికాసం పథకం  కింద రాష్ట్రంలో 105 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. ఈ పథకం కింద గిరిజనులకు  వ్యవసాయ పని ముట్లు ఇస్తున్నాం. ఈ ఏడాది 7500 యూనిట్లను ఎకనామిక్ సపోర్ట్ స్కీం కింద ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. గిరిజన తండాలన్నిటికి 3 ఫేస్ కరెంట్ ఇవ్వడం కోసం సీఎం కేసీఆర్ గారు 220 కోట్ల రూపాయలు ఇచ్చారని, త్వరలో ప్రతి తండా, గిరిజన గ్రామ పంచాయితీకి 3 ఫేస్ కరెంట్ రానుందని అన్నారు.
దండేపల్లి వద్ద నిన్న శంకుస్థాపన చేసిన బిటి రోడ్డు కు అదనంగా  ఊట్ల వరకు ఇంకో 2 కోట్లు కావాలని అడిగారు. దీనికి ప్రతిపాదనలు పంపించండని సూచించారు. వచ్చే కేంద్ర బడ్జెట్ పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీకి వెళ్లి జి.ఓ 3 మీద, గిరిజన విశ్వ విద్యాలయం, ఇతర గిరిజన సమస్యలపై కేంద్రానికి విజ్ఞప్తులు ఇచ్చి వెంటనే పనులు అయ్యే విధంగా ఒత్తిడి తీసుకొస్తాము. మరోసారి వచ్చి సమగ్రంగా ఐటడీఏ సమీక్ష చేసుకుందామని మంత్రి అన్నారు. సమీక్ష అనంతరం మంచిర్యాలలో నూతనంగా నిర్మిస్తున్న  సఖీ కేంద్రం భవన నిర్మాణ పనులను పరిశీలించారు.  బెల్లంపల్లి లో కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్ తో కలిసి పూజలు చేశారు.

Related Posts