YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

కొండగట్టు దేవాలయం భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి

కొండగట్టు దేవాలయం భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి

కొండగట్టు దేవాలయం భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి
జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల ఫిబ్రవరి 19 ఫిబ్రవరి 19
కొండగట్టు  దేవాలయానికి ధర్శనార్థం వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,  దేవాలయ పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా, నిత్యం పారిశుద్ద్య కార్యక్రమాలను నిర్వహించాలని, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా స్థలాలను గుర్తించాలని,  అగ్ని, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ముందస్తుగా తీసుకునే చర్యలపై అధికారులు వచ్చే మంగళవారం క్షేత్రస్థాయిలొ పర్యటించి ప్రమాద నివారణ మరియు జాగ్రత్తలపై ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.  దేవాలయ పరిశుభ్రతపై  వారంలో ఒక రోజు స్పెషల్ డ్రైవ్ కింద గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికులు, జేఎన్టీయూ స్టూడెంట్స్ మరియు ప్రజల సహాకారంతో శ్రమదానం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని,  అవసరం మేరకు పారిశుద్ద్య కార్మికులకు నియమించుకోవాలని సూచించారు.  గుట్ట క్రింది పరిసరప్రాంతాలు ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలను చేపట్టాలని,  అధిక ధరలకు దుకాణం దారులు అమ్మకాలు జరుగకుండా చర్యలు చెపట్టాలని అన్నారు.   ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా  వాహన పూజలు గుడి కి కొంచం దూరంలో నిర్వహించేలా చూడాలని,కోనేరు లో స్నానాలు చేయుటకు కోనేరు ఆవరణలో శవర్లు ఏర్పాటు చేయాలని భక్తులు సమర్పించిన పూలు పండ్లు పూజ సామాన్లు వాడకుండా తిరిగి ఇతరులకు ఆమ్మడం వంటివి జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  రవాణాశాఖ ద్వారా ప్రతి మంగళ, శనివారాలలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాహనాలలో పరిమితికి మించి భక్తులతో ప్రయాణాలు చేయకుండా కఠినచర్యలు చేపట్టాలని సూచించారు.   వృద్ధులకు వికలాంగుల కొరకు వీల్చైర్ సపోర్టింగ్ స్టాండ్లు మొదలగునవి ఏర్పాటు చేయాలని, కోతుల వలన దెబ్బతిన్న సీసీ కెమెరాలు మరమ్మతులు చేయించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలొ స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ అరుణశ్రీ, డిఎస్పి వెంకటరమణ, జిల్లా అటవిశాఖ అధికారి నరసిహరావు,ఈ ఓ ,డిపిఓ,ఎం.వి.ఐ., ఈఈఆర్బీ, ఆర్టీసి శాఖల అధికారులు పాల్గోన్నారు.

Related Posts