YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బి.సి బాలుర హాస్టల్లో విద్యార్థుల వీరంగం

బి.సి బాలుర హాస్టల్లో విద్యార్థుల వీరంగం

బి.సి బాలుర హాస్టల్లో విద్యార్థుల వీరంగం
భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 20 
పాల్పంచ ప్రభుత్వ బాలుర వసతి హాస్టల్ లో విద్యార్థులు గంట సేపు వీరంగం సృష్టించారు. హాస్టల్ లో చెడు వ్యసనాలకు ( మందు , సిగరెట్) బానిసలయ్యారని భావిస్తున్న కొందరు విద్యార్థులు ఒక బ్యాచ్ గా ఏ అలవాట్లు లేని విద్యార్థులు ఇంకో బ్యాచ్ కి శుక్రవారం పాల్వంచ బొలోరిగూడెంలోని బిసి హాస్టల్లో విడిపోయి బాహాబాహీకి దిగారు.హాస్టల్ వార్డెన్ కు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా పిడి గుద్దులు  గుప్పించుకున్నారు.. విద్యార్థులు వీరంగం ఎంతకూ ఆగకపోవడంతో అక్కడ ఉన్న వారు పోలీసులకు సమాచారం అందజేశారు . రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాల విద్యార్థులను శాంతింపజేసి అక్కడనుండి నిష్క్రమించారు . కానీ ఇంతటితో ఆగదని తరచూ ఆ హాస్టల్ లోని విద్యార్థులు దగ్గరలోని షాపుల్లో మద్యం సేవించడం, సిగరెట్లు త్రాగడం జరుగుతుందని అది తెలుసుకున్న ఒక వర్గం వారు ఉద్దేశ్యపుర్వకంగానే తమ తప్పులను బహిర్గతం చేస్తున్నారని వారిపై తరచూ గొడవలకు దిగుతున్నారు కొందరు తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . ఇదే తంతు కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వారు భయపడుతున్నారు . ఇంత జరిగినా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల పై ఎటువంటి ప్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం గంటసేపు జరిగిన కోట్లాట ఘటన గూర్చి పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి . ఏది ఏమైనా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుకుంటున్నారు . ఈ విషయం పై హాస్టల్ వార్డెన్ రాజ్యలక్ష్మిని వివరణ కోరగా విద్యార్థులు రెండు బ్యాచ్ లుగా విడిపోవడం . ఈ రోజు కోట్టుకోవడం వారిలో కొందరు చెడు వ్యసనాలకు బానిసలవడం వాస్తవమేనని , ఈ విషయాలు అన్నీ నేడే తన దృష్టికి వచ్చాయని విద్యార్థుల బాధ్యులైన విద్యార్థుల పై క్రమశిక్షలు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related Posts