YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఈ విజయానికి 8 ఏళ్లు పట్టింది - "నాంది" సక్సెస్ మీట్ లో అల్లరి నరేష్

ఈ విజయానికి 8 ఏళ్లు పట్టింది - "నాంది" సక్సెస్ మీట్ లో అల్లరి నరేష్

ఈ విజయానికి 8 ఏళ్లు పట్టింది - "నాంది" సక్సెస్ మీట్ లో అల్లరి నరేష్

నాందితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు హీరో అల్లరి నరేష్. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రేక్షకాదరణతో విజయంవంతగా రన్ అవుతోంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది సక్సెస్ మీట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. దర్శకులు గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, నిర్మాతలు కేఎస్ రామారావు, అనిల్ సుంకర, హీరో సందీప్ కిషన్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  
దేవి ప్రసాద్ మాట్లాడుతూ.....నరేష్ గారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆయనతో నేను రెండు కాెడీ సినిమాలు చేశాను. ఒక సీరియస్ సినిమా చేయాలని ఉంది. కానీ అవకాశం వస్తుందో రాదో తెలియదు. ఆడియెన్స్ మాటలు వింటే కడుపు నిండిపోతుంది. వరలక్ష్మీ కనిపించగానే జయమ్మ జయమ్మ అని కేకలు వినిపిస్తున్నాయి. ఆర్టిస్టులు అంతా చాలా బాగా నటించారు. హీరోయిన్ అందంగా ఉంది. ప్రియదర్శి, ప్రవీణ్ చాలా బాగా నటించారు. కృష్ణేశ్వరరావు తాగుబోతు క్యారెక్టర్ ఇంకా బాగుంది. ఒక సినిమాపై ఇష్టం ఏర్పడాక ఎంతైనా మాట్లాడాలని అనిపిస్తుంది. కోర్ట్ డ్రామా చేయడం ఎంత కష్టమో దర్శకుడికే తెలుస్తుంది. చిన్న పాయింట్ మిస్ అయినా బోర్ కొడుతుంది. అలాంటి గ్రిప్పింగ్ గా కోర్ట్ డ్రామా చేశాడు. అది మామూలు దర్శకుల వల్ల కాదు. విజయ్ ను చూడగానే ఇతను పెద్ద దర్శకుడు అవుతాడని అనుకున్నాను. నిర్మాత సతీష్ నిర్మాతగా అద్భుతంగా వ్యవహరించారు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ కావాలి. సేమ్ యూనిట్ మళ్లీ సినిమా చేయాలి. అన్నారు.
రమేష్ రెడ్డి మాట్లాడుతూ...నాంది స్టార్ట్ అయ్యేప్పుడు నరేష్ గారు ఈ సినిమా ఏంటి దర్శకుడు విజయ్ కు మతిపోయిందా అన్నారు చాలా మంది. మరికొందరు ఇంకో రకంగా విమర్శించారు. కానీ విజయ్  పది కాలాలు మిగిలిపోయే సినిమా చేశాడు. వెంకట్ రాసిన కథ మీద నమ్మకంతో, దర్శకుడి మీద నమ్మకంతో నిర్మాత సతీష్ గారు నరేష్ గారి దగ్గరకు వెళ్లారు. నరేష్ గారు వీళ్ల నమ్మకం చూసి సినిమా ఒప్పుకున్నారు, కసిగా నటించి, హిట్ కొట్టారు. నరేష్ గారు ఈ సినిమా విజయానికి మొదటి కారణం. గమ్యంలో క్రిష్, మహర్షిలో వంశీ పైడిపల్లి గారు నరేష్ భిన్నమైన పాత్రలు చేయగలరని చూపించారు. విజయ్ అదే దారిలో వెళ్లారు. మంచి సినిమా చేస్తే విజయానికి ఏదీ అడ్డు కాదు అని నాంది టీమ్ నిరూపించింది. అన్నారు.
 ర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ...నరేష్ మా బ్యానర్ హీరో. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నరేష్ గారికి 8 ఏళ్లుగా హిట్ కావాలని కోరుకుంటున్నాను. నాందితో హిట్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. యూఎస్ నుంచి రాగానే సినిమా చూశాను. ఇదొక్కటే కాదు ప్రతి కథకి, సినిమాకు సరెండర్ అయి నటించే హీరో నరేష్. ఆయన చాలా మంచి నటుడు. మహర్షి తర్వాత నరేష్ ను ఇలాంటి క్యారెక్టర్ లో చూడాలని అంతా అనుకున్నారు. టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ...టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా నేను చూడలేదు. మీ అందరు మాట్లాడింది విన్నాక. మంచి సినిమా మిస్ అయ్యాను అనుకుంటున్నాను. నరేష్ ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ల నాన్న నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి తిరుపతి వెళ్లినప్పుడు నరేష్ ను హీరో చేయమని ఈవీవీ గారికి చెప్పాను. నరేష్ బాగా నటించాడని అంతా చెప్పడం సంతోషంగా ఉంది. కొత్త సినిమాను ఆదరించాలని అనుకునే ప్రేక్షకులకు అలాంటి సినిమా ఇచ్చారు. మిగతా భాషల సినిమాలు రిలీజ్ కు భయపడుతుంటే టాలీవుడ్ లో ఉప్పెన, నాంది లాంటి సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అన్నారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...సినిమా యూనిట్ లోని ప్రతి ఒక్కరి నిజాయితీనే ఈ నాంది సినిమా విజయానికి కారణం. నరేష్ చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో నాంది ఒకటి అవుతుంది. మహర్షి లో నేను నరేష్ గారికి అవకాశం ఇవ్వలేదు. మాకే ఆయన అవకాశం ఇచ్చారు. ప్రయత్నం చేస్తే విజయం తప్పక దక్కుతుంది అనేందుకు నరేష్ గారే నిదర్శనం. తెలుగు ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కారం. ఇంత మంచి సినిమాను ఆదరించినందుకు. ఇండస్ట్రీ మంచి జోరుమీద ఉండగా, కరోనా వచ్చింది. అంతా భయపడ్డాం. కానీ ఒక్కో సినిమాను హిట్ చేస్తూ మొత్తం దేశం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు మన ప్రేక్షకులు. విజయ్ నాకు సహాయ దర్శకుడిగా తెలుసు. ఆయన ఇలాంటి కొత్త టైప్ ఆఫ్ సినిమా చేస్తాడని ఊహించలేదు. టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ...మా నరేష్ అన్న సినిమాకు హిట్ రావడం సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ అన్నా. మనం ఎంత కష్టపడ్డా ఎవరికీ గుర్తుండదు. కానీ విజయం దక్కితేనే మన కష్టం అందరికీ తెలుస్తుంది. నాందితో నీ కష్టం ప్రపంచానికి తెలిసింది. విజయ్ మాతో చెప్పే విషయాలకు, ఈ కథకు సంబంధం లేదు. చాలా కొత్తగా తీశాడు. టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా రిలీజ్ ముందే అరగంట చూశాను. సూపర్బ్ గా సినిమా చేశావ్ అని దర్శకుడు విజయ్ కు చెప్పాను. అన్నారు.
దర్శకుడు విజయ్ మాట్లాడుతూ...తెలుగు ప్రేక్షకులకు లైఫ్ టైమ్ రుణపడి ఉంటాను. మీడియా వాళ్లు కూడా చాలా సపోర్ట్ చేశారు. నేను ఎంత ఎమోషనల్ గా ఉంటానో సినిమాలో చూసి ఉంటారు. నరేష్ గారికి థ్యాంక్స్, కథ చెప్పిన వెంటనే షూటింగ్ కు రెడీ అయ్యారు. కోర్ట్ చాలా సహజంగా ఉంది అంటున్నారు. బ్రహ్మ కడలి గారికి థ్యాంక్స్. ఫొటోగ్రఫీ, డైలాగ్స్, మ్యూజిక్ ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ సూపర్బ్ గా చేశారు. ఆర్టిస్ట్ లు అంతా బాగా నటించారు. మా ఇంటి పేరు నిలబెడుతూ కనకమేడ లాంటి హిట్ ఇచ్చారు. అన్నారు.    
నవమి మాట్లాడుతూ...మంచి మూవీని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కేరళ నుంచి ఫ్రెండ్స్ కూడా సినిమా చూసి ఫోన్ చేస్తున్నారు. సినిమా బాగుందని చెబుతున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. అన్నారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ....స్టేజీ మీద చాలా ఈజీగా మాట్లాడుతుంటాను కానీ ఇప్పుడు ఉద్వేగంగా ఉన్నాను. తమిళ్ ఇండస్ట్రీలో కూడా నాకు ఇంత ప్రేమ దక్కలేదు. ప్రతిభను గౌరవించే టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికీ నమస్కారం. చాలా మంది చెప్పారు తెలుగు ఇండస్ట్రీకి వెళ్తే రాణిలా చూసుకుంటారు అని చెప్పారు. అది నా విషయంలో మరోసారి నిజమైంది. నాంది టీమ్ అందరికీ థ్యాంక్స్. విజయ్ విజన్ ఇవాళ అంతా చూస్తున్నారు. చెన్నైలో షో వేసుకుని చూశాను. అమ్మ రాధిక నాంది సినిమా చూసి ఏడ్చేసింది. సూర్య ప్రకాశ్ క్యారెక్టర్ తో ఎంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కోర్ట్ రూమ్ సీన్స్ సినిమాటిక్ గా లేవు అంటున్నారు. నరేష్ ఒక్కో సీన్ అద్భుతంగా చేసి ఏడిపించారు. అన్నారు
హీరో నరేష్ మాట్లాడుతూ...2012 తర్వాత హిట్స్ పలకరించడం మానేశాయి. ఈసారి మనదే అని ప్రతీసారి అనుకుంటున్నాను. కానీ 2021 మాత్రం ఈసారి మనదే అయ్యింది. మహర్షి తర్వాత కంగారు పడి సినిమా చేయకూడదు కంటెంట్ తో చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. విజయ్ వచ్చి కథ చెప్పినప్పుడు పోలీస్, లాయర్ ల గురించి అన్ని విషయాలు రీసెర్చ్ చేసి చేయాలని అతనికి చెప్పాను. మేము సినిమాలో చెప్పిన సెక్షన్స్ గురించి ఇటీవల ఓ పోలీస్ అధికారి సినిమా చూసి మెచ్చుకున్నారు. చాలా రీసెర్చ్ చేశారు కదా అని ఆయన అడిగారు. విజయ్ కు, రైటర్ లకు థ్యాంక్స్ చెబుతున్నాను. విజయ్ గారికి చాలా చెక్స్ వచ్చి ఉంటాయి అడ్వాన్స్ లుగా. విజయ్ తో ఒకాయన మాట్లాడుతూ..ఫ్లాప్ హీరోతో సినిమా చేస్తున్నావేంటని అడిగాడట. అప్పుడు విజయ్ కథలో కంటెంట్ ఉండాలి, హీరో టాలెంటెడ్ అయి ఉండాలి సక్సెస్ ఫెయిల్యూర్ తో పనిలేదు అన్నాడట. దేవి ప్రసాద్ గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఆయన మంచి దర్శకుడు అని తెలుసు గానీ ఇంతమంచి నటుడు అని తెలియదు. ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటది. ఆరు నిమిషాల ఒక షాట్ ఉంటుంది, నేను వరలక్ష్మి, ప్రియదర్శి ఆ సీన్ లో చేయాలి. అంత సేపు ఎమోషన్ క్యారీ చేయాలి. చేయగలమా అనుకున్నాం. కానీ సీన్ చేశాక సంతృప్తిగా అనిపించింది. సతీష్ నిర్మాతగా ధైర్యం చేశారు. కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో ప్రయోగాత్మక సినిమా ఏంటి అనుకోకుండా కొత్త తరహా సినిమా ప్రయత్నించారు. ఇకపైనా ఇలాంటి డిఫరెంట్ సినిమాలే చేయాలని కోరుతున్నా. నేను కూడా ఈ విజయాన్ని కొనసాగించేలా సినిమాలు ఎంచుకుంటాను. మరో రెండేల్లు ఇండస్ట్రీ కోలుకోదు అన్నారు. కానీ ప్రేక్షకులు మా భయాన్ని పోగొట్టారు. మంచి హిట్స్ ఇస్తున్నారు. అన్నారు.
తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని, గ్రిగ్నేశ్వర రావు.

Related Posts