YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేనలో ధైర్యాన్ని నింపిన ఫలితాలు

జనసేనలో  ధైర్యాన్ని నింపిన ఫలితాలు

విజయవాడ, ఫిబ్రవరి 23, 
సార్వత్రిక ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చూసిన జనసేన..పంచాయితీ ఎన్నికల్లో మాత్రం ఉనికి చాటుకుంది. పంచాయితీలు చాలా తక్కువగానే వచ్చినప్పటికీ ఓట్ల శాతాన్ని లెక్కగడుతోంది. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్ధులు కొన్ని చోట్ల గెలుపొందడం..పల్లెల్లో పట్టు ఉందని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడంతో ఎన్నికల ఫలితాలు జనసేనలో కొత్త జోష్ తీసుకొచ్చాయి.అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఉన్నప్పటికీ తొలివిడతలో 18, రెండో విడతలో 22, మూడో విడతలో 23 శాతం ఓట్లు వచ్చాయని చెబుతున్నాయి శ్రేణులు ఇక 1500 పైన పంచాయితీల్లో జనసేన రెండో స్థానంలో నిలిచిందంటే తమకు పల్లెల్లో ఓటు బ్యాంకు ఉందనేది గుర్తించాలన్నది వారి మాట . ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో బలం పుంజుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మొదటి దశలో 1700 పంచాయతీల్లో, రెండో దశలో 1500 పంచాయితీల్లో, మూడో దశలో 1654 పంచాయితీల్లో రెండో స్థానంలో తమ పార్టీ అభ్యర్థులు నిలిచారని లెక్క కడుతున్నారు నేతలు. ఇక జిల్లాల వారీగా చూస్తే ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన ప్రభావం చూపగలిగింది.ఇక మరోసారి రాజోలు ప్రజలు జనసేనకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో జనసేనను గెలిపించిన స్థానికులు…పంచాయతీ ఎన్నికల్లోనూ 10 స్థానాలు కట్టబెట్టారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు పలికినా…జనం మాత్రం జనసేనకే జై కొట్టారు. 10కి పైగా గ్రామాల్లో జనసేన మద్దతుదారులు విజయఢంకా మోగించారు.అన్ని పార్టీలు ఎవరికి వారు లెక్కలు కడుతున్నా… జనసేన మాత్రం ఓట్ల శాతాన్ని తెరపైకి తెస్తోంది. ఇదే ఊపుతో ఇప్పుడు మున్సిపాల్టీ, కార్పొరేషన్‌ వైపు దృష్టి సారిస్తోంది.

Related Posts