YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్ పై సీబీఐ గురి

బెంగాల్ పై సీబీఐ గురి

బెంగాల్ పై సీబీఐ గురి
కోల్ కత్తా, ఫిబ్రవరి 23
బెంగాల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి సీబీఐ కూడా తన వంతు సాయం అందిస్తోంది. గత నాలుగైదేళ్ల కాలంలో అనేక కేసులతో తృణమూల్ కాంగ్రెస్ నేతల్ని భయపెట్టిన సీబీఐ… ఎన్నికల ముందు వచ్చే సరికి.. వారందర్నీ బీజేపీలో చేరేలా చేయడంలో సక్సెస్ అయింది. శారదా చిట్స్ సహా అనేకానేక కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వారు ఇప్పుడు కమలం నీడలో సేదతీరుతున్నారు. వారి విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుంది. చర్యల గురించి ప్రస్తావించడం లేదు. అయితే సీబీఐ మాత్రం ఆగడం లేదు. 
బీజేపీలో చేరిన వారిని వదిలేసి.. ఇతర టార్గెట్లపై దృష్టి పెట్టింది. తాజాగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలోని అభిషేక్‌ బెనర్జీ ఇంటికి వెళ్లిన సీబీఐ బృందం, కోల్‌ స్కామ్‌ కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఆయన భార్య రుజిరా బెనర్జీకి నోటీసులు ఇచ్చింది. ముందుగానే ఆమెకు సమన్లు జారీ చేసి సీబీఐ ఆఫీసుకు పిలిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. బొగ్గు గనుల్లో అవకతవకలు జరిగాయని మూడు నెలల కిందటే సీబీఐ కేసు నమోదు చేసి తృణమూల్ నేతలపై గురి పెట్టింది. తమను భయపెట్టడానికి బీజేపీ సీబీఐని వాడుకుంటుంటోందని మండిపడుతోంది. ఇప్పటికే సీబీఐని బీజేపీ మిత్రపక్షంగా విపక్ష పార్టీలు సెటైర్లు వేస్తూంటాయి. రెండు రోజుల కిందట అభిషేక్ బెనర్జీ .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై దాఖలు చేసిన ఓ పరువు నష్టం కేసులో హాజరు కావాలని కోర్టు 
షాను ఆదేశించింది. ఆధారాలు లేకుండాతనపై ఆరోపణలు చేశారని అభిషేక్ బెనర్జీ అమిత్ షాపై పిటిషన్ వేసారు. బెంగాల్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు అమిత్ షాకు సమన్లు చేసిన మరుసటి రోజే సీబీఐ అభిషేక్ బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. దేశంలో ఎక్కడ గెలవాలనుకుంటే అక్కడ బీజేపీ ముందుగా సీబీఐని పంపుతుంది. అక్కడ ఉన్న పార్టీలను.. నేతలపై సీబీఐ రెయిడ్ చేస్తుంది. దాంతో వారు బీజేపీలో చేరిపోతారు. దాంతో బీజేపీ బలం పుంజుకుంటుంది. వారు చేసిన నేరాలన్నీ మరుగున పడిపోతాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగాల్ వరకూ.. అన్ని చోట్లా అదే జరుగుతోంది.
 

Related Posts