YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఫైర్ బ్రాండ్ గా మహువా మొయిత్రా

ఫైర్ బ్రాండ్ గా మహువా మొయిత్రా

ఫైర్ బ్రాండ్ గా మహువా మొయిత్రా
కోల్ కత్తా, ఫిబ్రవరి 23  
రాజకీయాల్లో ఎదగడానికి అనుభవం అక్కరలేదు. వయసుతో అసలు పనిలేదు. సబ్జెక్టు పై పట్టు.. సామాజిక అంశాలపై అవగాహన ఉంటే చాలు పాలిటిక్స్ లో పేరు దానంతట అదే వస్తుంది. ఆ కోవలోకి చెందిన వారే పశ్చిమ బెంగాల్ కుచెందిన మహువా మొయిత్రా. ఈ పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగుతుంది. ఇలాంటి నేత తమ పార్టీలో ఎందుకు లేకపోయారని అన్ని పార్టీలూ ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. మహువా మొయిత్రాను చూసి నేటి యువతరం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది.మహువా మొయిత్రా పట్టుదల, కసి ఆమెను రాజకీయాల్లో రాణించేలా చేశాయి. ఎవరూ వేలెత్తి చూపడానికి ధైర్యం చేయలేకపోయినా మోదీని మహువా మొయిత్రా పార్లమెంటు లో కడిగిపారేశారు. దేశంలో నియంత పాలన సాగుతుందని ధైర్యంగా చెప్పారు. మాజీ సీజేఏపైన కూడా విమర్శలు చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఒకదశలో మహువా మొయిత్రా పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకత్వం భావించినా ఆమె వాగ్దాటిని చూసి వెనక్కు తగ్గింది.ఒకటి కాదు.. రెండు కాదు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మహువా మొయిత్రా తప్పుపట్టారు. ప్రభుత్వాన్ని బట్టలూడదీసి బయటపెట్టారు. ఇంటర్నెట్, సోషల్ మీడియాపై నిఘా, ఆదార్ తో బ్యాంకుల అనుసంధానం వంటి విషయాలపై మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజల పక్షాన నిలబడిన ఈ యంగ్ ఎంపీకి దేశం నలుమూలల నుంచి మద్దతు లభిస్తుంది. అనేక అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించి మహువా మొయిత్రా విజయం సాధించారు. మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. మహువా మొయిత్రా దెబ్బకు ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది.మహువా మొయిత్రా కు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. రాజకీయాలంటే ఆసక్తి ఉండటంతో 18 ఏళ్ల వయసు నుంచే వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన మహువా మొయిత్రా తొలుత కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 2016లో టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే మహువా మొయిత్రా లోని ప్రతిభను గుర్తించిన మమత బెనర్జీ 2019 ఎన్నికల్లో ఎంపీగా అవకాశమిచ్చారు. కృష్ణనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వందల సంఖ్యలో ఎంపీలున్నా ఇప్పుడు మహువా మొయిత్రా మాత్రమే దేశంలో హాట్ టాపిక్ గా మారారు.

Related Posts