YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, ఫిబ్రవరి 23
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా  జరుగనున్న నేపథ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
పరదాలు విరాళం :
తిరుపతికి చెందిన  నరసింహులు రెండు పరదాలు, రెండు కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారు. రానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  శాంతి, ఏఈవో  ధనంజయుడు, సూపరింటెండెంట్   చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్  శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏకాంతగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
 శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ -19 నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. మార్చి 1న సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ                                                  ఉదయం                                  రాత్రి
02-03-2021(మంగళవారం)          ధ్వజారోహణం(మీనలగ్నం)  పెద్దశేష వాహనం
03-03-2021(బుధవారం)            చిన్నశేష వాహనం                     హంస వాహనం
04-03-2021(గురువారం)            సింహ వాహనం                   ముత్యపుపందిరి వాహనం
05-03-2021(శుక్రవారం)         కల్పవృక్ష వాహనం                 సర్వభూపాల వాహనం
06-03-2021(శనివారం)      పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం)   గరుడ వాహనం
07-03-2021(ఆదివారం)        హనుమంత వాహనం            తిరుచ్చి, గజ వాహనం
08-03-2021(సోమవారం)          సూర్యప్రభ వాహనం             చంద్రప్రభ వాహనం
09-03-2021(మంగళ వారం)         సర్వభూపాల వాహనం       అశ్వవాహనం
10-03-2021(బుధవారం)            చక్రస్నానం                        ధ్వజావరోహణం
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు  స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు. గరుడసేవ మాత్రం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు నిర్వహిస్తారు.

Related Posts