YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఆరోగ్య రంగంలో భారత్ సామర్థ్యం పట్ల  ప్రపంచానికి ఇనుమడించిన విశ్వాసం 

ఆరోగ్య రంగంలో భారత్ సామర్థ్యం పట్ల  ప్రపంచానికి ఇనుమడించిన విశ్వాసం 

ఆరోగ్య రంగంలో భారత్ సామర్థ్యం పట్ల  ప్రపంచానికి ఇనుమడించిన విశ్వాసం 
న్యూఢిల్లీ ఫిబ్రవరి 23 
కరోనా కట్టడికి మేడిన్‌ ఇండియా వ్యాక్సిన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను మనం అధిగమించాల్సిన అవసరం ఉందని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి తరహాలో భవిష్యత్‌లో పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో చేపట్టిన చర్యల అమలుపై ప్రధాని మోదీ మంగళవారం ఓ వెబినార్‌లో మాట్లాడారు. కరోనా అనంతరం ఆరోగ్య రంగంలో మన సామర్థ్యం పట్ల  ప్రపంచానికి విశ్వాసం ఇనుమడించిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఆరోగ్య రంగానికి అసాధారణంగా బడ్జెట్‌ కేటాయింపులుండటం ఈ రంగం పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్‌-19 వంటి పలు సవాళ్లను ఎదుర్కొనేలా కరోనా వైరస్‌ మనకు ఓ గుణపాఠం నేర్పిందని చెప్పారు. వైద్య పరికరాల నుంచి మందుల వరకూ, వెంటిలేటర్ల నుంచి వ్యాక్సిన్ల వరకూ..శాస్త్రీయ పరిశోధనల నుంచి ఆరోగ్య మౌలిక సదుపాయాల వరకూ భారత్‌ భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్య ఎమర్జెన్సీనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని అన్నారు. 

Related Posts