YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ఈజీఎస్ లో కొత్త రికార్డులు

ఈజీఎస్ లో కొత్త రికార్డులు

ఈజీఎస్ లో కొత్త రికార్డులు
ఖమ్మం, ఫిబ్రవరి 24, 
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ఉపాధి హామీ పనుల ద్వారా గడిచిన నాలుగేళ్లుగా రూ.55,535 కోట్లను చెల్లించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.14,089.12 కోట్లను అందజేసింది. జిల్లాలో జాబ్‌ కార్డులున్న కుటుంబాలు జిల్లాలో నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. 2017-18లో 2,78,049 కుటుంబాల్లో 6,23,197 మందికి వ్యక్తిగత జాబ్‌ కార్డులు ఉన్నాయి. 2020-21లో 2,96,445 కుటుంబాల్లో 6,64,790 మందికి వ్యక్తిగత జాబ్‌ కార్డులు ఉన్నాయి. ఈజీఎస్‌ కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం చొప్పున దినసరి వేతనాన్ని అదనంగా ఇవ్వనుంది. దీంతో జిల్లాలోని వేలాది మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో పనిలేని కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో శాశ్వత పనులు చేపట్టారు.  ఈజీఎస్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో రాష్ట్రంలోనే తొలిసారిగా పంట కాలువల పూడికతీత పనులు ఖమ్మం జిల్లాలో చేపట్టారు. 560 కిలోమీటర్ల మేర ఉన్న పంట కాలువలకు మరమ్మతులు చేపట్టాలని, పూడికతీత తీయాలని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్‌ ఆదేశించారు. నిరుడు సత్తుపల్లి నియోజకవర్గంలోని పంట కాలువల్లో మొత్తం 350 కిలోమీటర్ల మేర పూడికతీశారు. సత్తుపల్లి మండలంలోనే 2500 మంది ఉపాధి కూలీలు, 12 జేసీబీల ద్వారా బేతుపల్లి పెద్దచెరువు ఆయకట్టు పరిధిలోని 23 కిలోమీటర్ల మేర పంటకాలువలను శుభ్రపర్చారు. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లోని కాలువల్లో పూడికతీత పనులు జరిగాయి. 

Related Posts