YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వన్యప్రాణులకు రక్షణ కరువు

వన్యప్రాణులకు రక్షణ కరువు

తిరుపతి, ఫిబ్రవరి 26, 
చిత్తూరు జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. రకరకాల కారణాలతో ఎప్పుడు దేని ప్రాణం పోతుందో తెలియదు. అరుదైన చిరుత పులులు సైతం ఇటీవల కాలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఇక మృత్యువాత పడుతున్న ఏనుగుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. వన్యప్రాణులు, మృగాలకు సంబంధించి పటిష్టమైన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వన్యప్రాణి మనుగడ ప్రశ్నార్థకమైంది. జిల్లాలోని అడవుల్లో అమర్చిన ఉచ్చులు, నల్లమందు ఉండలు, నాటు తుపాకులతో ఆటోమేటిక్‌ ఫైరింగ్, అడవిని ఆనుకుని ఉన్న పొలాల్లో కరెంటు తీగలకు బలవుతూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా వన్యప్రాణుల వేట నిరాటంకంగా సాగుతోంది. కొందరు నిత్యం అడవిలో వేటే జీవనోపాధిగా మార్చుకున్నారు. దీంతో అడవుల్లో నాటు తుపాకుల మోత తగ్గడం లేదు.  ఉరులు, నాటు బాంబులతో సైతం వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. అలాగే అటవీ శివారు ప్రాంతాల్లోని రైతులు అడవి జంతువుల బారి నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి విద్యుత్‌ తీగలు అమర్చుతున్నారు. మేత, నీటి కోసం వస్తున్న వన్యప్రాణులు ఆ తీగలకు తగులుకుని మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రోజురోజుకీ వన్యప్రాణుల సంఖ్య క్షీణిస్తోంది.2013 నుంచి 2017వ సంవత్సరం మధ్య కాలంలో పది ఏనుగులు నీటి దొనల్లో పడి, విద్యుత్‌ షాక్, వ్యవసాయ బావులు మృతి చెందాయి. గతేదాడి కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగులు విద్యుదాఘాతానికి బలయ్యాయి. ఇటీవల ఎర్రావారిపాళెం మండలం కోటకాడిపల్లె వద్ద ఓ ఏనుగు మృతి చెందింది. చిరుతల విషయానికొస్తే గత జనవరిలో బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లె అటవీ ప్రాంతంలో ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మృతి చెందింది. ఐరాల మండలం మల్లార్లపల్లె వద్ద ఓ చిరుత వేటగాళ్ల ఉచ్చుకు చిక్కింది. దీన్ని జూకి తరలించగా మృతి చెందింది. తాజాగా కుప్పం సరిహద్దులోని క్రిష్ణగిరి వద్ద ఓ చిరుతను ఓ వ్యక్తి కత్తితో నరికి చంపేశాడు. ఇప్పటికైనా అటవీశాఖ తగుచర్యలు తీసుకోవాల్సి ఉంది.

Related Posts