YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేయనున్న 'మడ్డీ' టీజర్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేయనున్న 'మడ్డీ' టీజర్

ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ ఫిల్మ్ గా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ మరియు మలయాళం మొత్తం 5 భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న సినిమా 'మడ్డీ'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుని సినిమా మీద ఆసక్తి రేకెత్తించింది. ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ పైగా సాధించి ట్రెండ్ అవుతోంది. 'మడ్డీ' చిత్ర టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫిబ్రవరి 26న సాయంత్రం 6:03 కి విడుదల చేయనున్నారు.
'మడ్డీ' చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రియల్ లొకేషన్స్ లో, రియల్ మడ్ రేసింగ్ ప్లేయర్స్ తో ఎంతో రియలిస్టిక్ గా, లావిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కె జీ ఎఫ్ ఫేం రవి బస్రుర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేశారు. మోషన్ పోస్టర్ విడుదల తర్వాత ప్రేక్షకులు మడ్డీ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్ ను దేశవ్యాప్తంగా భారీగా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటించనున్నారు.

Related Posts