YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుచానూరు ఆలయంలో చిన్న జీయర్ స్వామి

తిరుచానూరు ఆలయంలో చిన్న జీయర్ స్వామి

తిరుపతి ఫిబ్రవరి 26, 
త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి శుక్రవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద శ్రీ స్వామివారికి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.జీయర్స్వామి అమ్మవారి ఆలయ ప్రదక్షిణ అనంతరం ధ్వజస్థంభానికి నమస్కరించి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకు న్నారు. అనంతరం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి,శ్రీ సుందరరాజ స్వామివారిని దర్శించుకున్నారు. ఛైర్మన్, ఈవో త్రిదండి చిన్న జీయర్ స్వామివారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు జూపల్లి రామేశ్వరరావు, శివకుమార్,వెంకట భాస్కర్రావు, ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.ప్రజల్లో విచ్చల విడితనం పోవాలి జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ప్రజల్లో విచ్చల విడితనం పోయి, జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ నుండి బయట పడాలని త్రిదండి చిన్న జీయర్ స్వామివారు పిలుపునిచ్చారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం ఆలయం వెలుపల స్వామిజీ మీడియాతో మాట్లాడారు.తగ్గి పోయిందనుకున్న కరోనా వ్యాధి మళ్ళీ ప్రబలుతోందనే ఆందోళన ప్రారంభమైందని, ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, పరిశుభ్రతతో క్రమశిక్షణగా మసలు కోవాలన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుండి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. పవిత్రమైన మాఘమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం పుణ్యదాయకమని చెప్పారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఆలయాల మీద సమాజ విఘాత శక్తులు దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేసిన నేపథ్యంలో తాను రాయలసీమలోని అనేక ఆలయాలను సందర్శించినట్లు చెప్పారు. ఈ ఆలయాల్లో ఆద్భుత శిల్పసంపద, శక్తి వంతమైన దేవతా విగ్రహాలు ఉన్నాయన్నారు. ఆలయాలకు ఆదరణ, ఆరాధన కల్పించేందుకు కొన్ని సూచనలతో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి నివేదిక అందించనున్నట్లు చెప్పారు. ఆలయాలు బాగుపడితే ప్రజల్లో విశ్వాసం, రోగ నిరోధక శక్తి పెరిగి సమాజం ఆరోగ్య కరంగా ఉంటుందన్నారు. ప్రపంచంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని కూడా ప్రార్థిస్తానని జీయర్స్వామి చెప్పారు.

Related Posts