YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

షాదీ  మంజిల్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

షాదీ  మంజిల్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

షాదీ  మంజిల్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
నెల్లూరు ఫిబ్రవరి 26
నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్, 4వ మైలు సమీపంలోని షాదీ మంజిల్ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు . ఈయన వెంట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతవాసుల చిరకాల కోరికైనటువంటి షాదీ మంజిల్ ను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దిష్ట కాలంలో పనులను పూర్తిచేయాలని కమీషనర్ దినేష్ కుమార్ని  రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.
రూరల్ నియోజకవర్గం వేగవంతంగా విస్తరిస్తునందున శివారు ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి  ఆ సమస్యలను  పరిష్కరించాలని మునిసిపల్ కమిషనర్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక శాఖ సిబ్బంది మరియు వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts