YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

దోమలు బాబోయ్...దోమలు

దోమలు బాబోయ్...దోమలు

దోమలు బాబోయ్...దోమలు
హైదరాబాద్, ఫిబ్రవరి 27,
సాయంత్రమైతే చాలు దోమలు చంపుతున్నరు' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూకట్‌పల్లి సర్కిల్‌ ప్రజలు. ఇట్లయితే డెంగ్యూ, మలేరియా, ఇతర అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. దోమన బెడదకు నిద్రపట్టట్లేదని చెప్తున్నారు. కారణాలేమైనా ఇక్కడ దోమల బెడదతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాటి నివారణకు జీహెచ్‌ఎంసీ తరపున తీసుకునే చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఫాగింగ్‌ ఏమాత్రం చేయడం లేదు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వీధిలో నామమాత్రంగా చేస్తున్నారు. అగర్‌బత్తీలు, ఆలౌట్‌లు ఎన్నివాడినా దోమల బాధ తప్పడం లేదని స్థానికులు అంటున్నారు. వాటిని వారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూకట్‌పల్లి పరిసరాల్లోని చెరువుల్లో రోజురోజుకూ పెరుగుతున్న గుర్రపు డెక్క కూడా ఇక్కడ దోమలు వృద్ధి చెందడానికి ప్రధాన కారణం అవుతోంది. చెరువుల్లో గుర్రపు డెక్క, మురుగునీరు విస్తరిస్తుండటంతో దోమల బెడద పెరగడంతో పాటు ఆయా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలోని నల్లచెరువు, ఎల్లమ్మ చెరువు, పరికి చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను, చెరువుల్లో పరిసరాల్లోని మురుగు నీటిని కలవకుండా చేయడంలో అధికారుల తీరు సక్రమంగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దోమల నివారణకు చెరువుల్లో యాంటీ లార్వా రసాయనాలు పిచికారీ చేస్తున్నప్పటికీ మురుగు తొలగించడం, గుర్రపు డెక్క తొలగించడం వంటి శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టకపోవడంతో దోమలను పూర్తిగా నివారించలేకపోతున్నారు. ఫలితంగా డెంగూ, మలేరియా, కలరా తదితర సీజనల్‌ వ్యాధులకు ఇదో కారణం అవుతోంది.దోమలు అభివృద్ధి చెందకుండా ఉండేందుకు ప్రతీ ఆదివారం 10 నిమిషాలపాటు విధిగా అందరూ తమ ఇండ్లల్లో పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయాలని, డ్రమ్ముల్లో, గుంతల్లో నీరు నిల్వకుండా చూడాలిన ప్రతీ పౌరుడు ఉదయం పది నిమిషాల ఇది పాటించాలని గతంలో కేటీఆర్‌ ఇచ్చిన పిలుపును అధికారులు, ప్రజా ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేయడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా రోజూ ఫాగింగ్‌ చేయాలని, చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించాలని, దోమలను అరికట్టి ప్రజల ఆరోగ్యాలాను కాపాడాలని ఆల్విన్‌ కాలనీ వాసులు, బీజేపీ నాయకుడు కుమార్‌ యాదవ్‌ కోరుతున్నారు.దోమల నివారణకు రోజూ ఫాగింగ్‌ నిర్వహిస్తున్నాం. యాంటీ లార్వా ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాం. చెరువుల్లో డ్రోన్‌ల సహాయంతో యాంటీ లార్వా మందులు చల్లుతున్నాం. గుర్రపు డెక్కను తొలగిస్తున్నాం. అయితే పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు చేరుతుండటంతో గుర్రపు డెక్క తరచూ పెరుగుతోంది.

Related Posts