YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా మాఘ పౌర్ణమి ఉత్సవాలు

ఘనంగా మాఘ పౌర్ణమి ఉత్సవాలు

ఘనంగా మాఘ పౌర్ణమి ఉత్సవాలు
భూపాలపల్లి/భద్రాద్రి ఫిబ్రవరి 27, 
జిల్లాలోని కాళేశ్వర త్రివేణి సంగమంలో మాఘ పూర్ణిమ పుణ్యస్నాన కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది. టీటీడీ తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. గోదావారి తీరంలో శ్రీవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక జలాభిషేకాలు చేస్తున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు. టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈకార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య దంపతులు పాల్గొన్నారు.
భద్రాద్రిలో ...
దక్షిణాది అయోధ్య అయిన భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో మాఘ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. మాఘ పౌర్ణమి సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నారు. 1,001 కలశాలతో సీతారాములకు అభిషేకం చేస్తున్నారు. ఉదయం 10.30గంటలకు మహా కుంభప్రోక్షణ, మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12.30గంటలకు ప్రధాన ఆలయంలో మహానివేదన, సాయంత్రం శ్రీరంగనాయక స్వామి వార్షిక తిరుకల్యాణం నిర్వహించనున్నారు. మాఘ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నందున సీతారాముల వారి నిత్యకల్యాణాలు నిలిపివేశామని ఆలయ ఈవో శివాజీ తెలిపారు. 

Related Posts