YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

చిన్నశేషవాహనంపై శ్రీ‌కృష్ణుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు  

చిన్నశేషవాహనంపై శ్రీ‌కృష్ణుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు  

చిన్నశేషవాహనంపై శ్రీ‌కృష్ణుని అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు  
తిరుపతి, ,మార్చ్ 03
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ‌కృష్ణుని అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో  ఏకాంతంగా జరిగింది.రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం.

Related Posts