YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భగవంతునికి ఇష్టమైన పువ్వులు

భగవంతునికి  ఇష్టమైన పువ్వులు

"అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః
సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః
జ్ఞాన  పుష్పం  తప: పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ 
సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్"
1. అహింసాపుష్పం:  ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.
2. ఇంద్రియ నిగ్రహం:  చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.
3.  దయ:  కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.  ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.
4.  క్షమ:  ఎవరైనా మనకి అపకారం చేసినా,  ఓర్పుతో సహించడమే క్షమ.  ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.
5. ధ్యానం:  ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవుని అందించే ఐదో పుష్పం.
6. తపస్సు:  మానసిక ( మనస్సు), వాచిక (మాట),కాయక ( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.  ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.
7. జ్ఞానం:  పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.  ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.
8.సత్యం:  ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.  ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.  ఇవన్నీ చాలా అరుదైన పుష్పాలే, అవన్నీ మా తోటలో లేవంటారా.  మరేం పరవా లేదు, ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts