YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

సూర్యప్రభ వాహ‌నంపై సూర్యనారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న  

సూర్యప్రభ వాహ‌నంపై సూర్యనారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న  

సూర్యప్రభ వాహ‌నంపై సూర్యనారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న  
తిరుపతి, మార్చ్ 8 
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు సూర్యనారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు.
          సూర్యప్రభ వాహనం - ఆయురారోగ్య‌ప్రాప్తి
     సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. 

Related Posts