YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

బడుల్లో కరోనా

బడుల్లో కరోనా

హైద్రాబాద్, మార్చి 18, 
స్కూళ్లలో కరోనా కేసుల కలకలం రేగింది. రాష్ట్రంలో రెండు రోజుల్లో 200 మందికిపైగా స్టూడెంట్లకు పాజిటివ్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనారిటీ గర్ల్స్ హాస్టల్లో 36 మంది స్టూడెంట్లకు వైరస్ సోకింది. మంచిర్యాల జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో 29 మంది.. కామారెడ్డి జిల్లాలో 32 మంది స్టూడెంట్స్ కరోనా బారిన పడ్డారు. దీంతో పేరెంట్స్ తమ పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే భయపడుతున్నారు.నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనారిటీ గర్ల్స్ హాస్టల్లో కొందరు స్టూడెంట్లు అస్వస్థకు గురయ్యారు. స్టూడెంట్లకు ఒళ్లు నొప్పులు, నీరసంగా ఉండటంతో మెడికల్ అధికారులకు ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం హాస్టల్ వద్దకు చేరుకున్న నాగోల్ పీహెచ్సీ సిబ్బంది 165 మంది స్టూడెంట్లతోపాటు 19 మంది టీచర్లకు కరోనా టెస్టులు చేశారు. ఇందులో 9, 10 తరగతులు చదువుతున్న 36 మంది స్టూడెంట్లకు పాజిటివ్ వచ్చింది. వీరిని ఇదే హాస్టల్లోని 5వ అంతస్తుకు, నెగటివ్ వచ్చిన స్టూడెంట్లను 2, 3, 4 అంతస్తులకు తరలించారు. స్టూడెంట్లను ఐసోలేషన్ లో పెట్టినట్లు మేడ్చల్ డీఎంహెచ్ఓ మల్లికార్జున్ తెలిపారు. స్టూడెంట్లకు నిరంతరం వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే గచ్చిబౌలిలోని కిమ్స్ లో చికిత్స అందిస్తామని తెలిపారు. ఒకే స్కూల్లో ఇంత మంది కరోనా బారిన పడటంతో స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పేరెంట్స్ హాస్టల్ వద్దకు చేరుకొని తమ పిల్లలను తీసుకెళ్తున్నారు.మంచిర్యాల జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో రెండు రోజుల్లో 44 కేసులు నమోదయ్యాయి. ఐదు రోజుల కిందట ఒక టీచర్కు పాజిటివ్ రావడంతో సోమవారం స్కూల్లో స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. టీచర్తో ప్రైమరీ కాంటాక్ట్గా గుర్తించిన 55 మందికి టెస్టులు చేశారు. వీరిలో 10 మంది టీచర్లు, ఇద్దరు ఆఫీస్ స్టాఫ్, ఇద్దరు మిడ్ డే మీల్స్ ఏజెన్సీ నిర్వాహకులు, ఒక స్టూడెంట్ మొత్తం 15 మందికి పాజిటివ్ వచ్చింది. మంగళవారం 8, 9, 10 క్లాస్లకు చెందిన 162 మంది స్టూడెంట్లకు టెస్టులు చేశారు. వీరిలో 29 మంది కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ స్టూడెంట్ల ఫ్యామిలీ మెంబర్లలో 22 మందికి టెస్టులు చేస్తే ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. స్టూడెంట్లు, పేరెంట్స్కు మెడికల్ కిట్స్ ఇచ్చారు. హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. గర్మిళ్ల జడ్పీ హైస్కూల్లో ఇద్దరు టీచర్లు, ముల్కల్ల హైస్కూల్లో ఒకరు కరోనా బారినపడ్డారు. చెన్నూర్ జడ్పీ హైస్కూల్లో సోమవారం ఒక టీచర్కు పాజిటివ్ వచ్చింది. దీంతో మంగళవారం స్కూల్లో క్యాంప్ ఏర్పాటు చేసి 175 మందికి టెస్టులు చేశారు. అందరికీ నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.కామారెడ్డి జిల్లా టెకిర్యాల్ కస్తూర్బా స్కూల్లో కరోనా కలకలం రేగింది. స్టూడెంట్స్, స్టాఫ్ కలిపి 140 మందికి టెస్టులు చేయగా.. 32 మంది స్టూడెంట్స్కు పాజిటివ్ వచ్చింది. స్కూల్, హాస్టల్ ఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్స్ మధ్యలో ఇంటికి వెళ్లి రావటం, తల్లిదండ్రులు వచ్చి కలిసి పోవటం వల్ల వైరస్ సోకి ఉంటుందని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని అన్ని స్కూళ్లు, హస్టళ్లలో మొబైల్ టీమ్స్తో టెస్టులు చేయనున్నట్లు చెప్పారు. ఈ జిల్లాలో మంగళవారం మొత్తం 46  కేసులు నమోదయ్యాయిహైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 15 రోజుల్లో వేయి కేసులు నమోదయ్యాయి.  గత నెలతో పోలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం కేసులు డబుల్ అయ్యాయి. హైదరాబాద్ సిటీలోని అమీర్పేట్, దిల్ సుఖ్నగర్, కూకట్పల్లి, చిక్కడపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో.. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నెల వ్యవధిలో జీహెచ్ఎంసీలో 557, రంగారెడ్డిలో 207, మేడ్చల్లో 197 కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో మరో 204 మందికి కరోనా సోకింది. బుధవారం రాత్రి దాకా 60,263 మందికి టెస్టులు చేసినట్లు హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,01,522కి పెరిగిందని చెప్పింది. కరోనాతో నిన్న మరో ఇద్దరు చనిపోయారని, దీంతో మృతుల సంఖ్య 1,656కు పెరిగిందని బులెటిన్లో అధికారులు పేర్కొన్నారు

Related Posts