YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*జీవితం ఒక సాధన కావాలి*

*జీవితం ఒక సాధన కావాలి*

అలౌకిక విషయాలకు అద్దం పట్టలేం. అందుకే లౌకిక, అలౌకిక స్థితుల మధ్య ఘర్షణ. ఈ ఘర్షణ అంతర్ముఖమైతే అధ్యాత్మిత, బహిరంగమైతే తార్కికత.  ఒక వ్యక్తి ఘర్షణ మౌనమవుతుందో, మాటల్లోకి వస్తుందో ఎవరూ చెప్పలేరు. మౌనమైన ఘర్షణ ఆనందానికి, మాటల్లోకి వచ్చిన ఘర్షణ హింసకి దారి తీస్తుంది. వేదాంతం ఇటు మౌనాన్ని, అటు మాటలని ఆవగింజంత కూడా ఖాతరు చేయదు. ఎందుకంటే ఇవి రెండూ మనస్సు ప్రధానంగా జరిగేవి కాబట్టి. వేదాంతం చెప్పేది ఒక్కటే. ఏదైనా సరే ‘‘నువ్వు’’ ప్రధానంగా జరగాలి. ‘నువ్వు’ ప్రధానంగా జరగగల పని ఒక్కటే. మనస్సుని నడపించడం.  మనసుని నడిపించేవాడికి మౌనమూ ఉండదు. మాటలూ ఉండవు. చేత ఒక్కటే ఉంటుంది. చేత శబ్దమూ కాదు, నిశబ్దమూ కాదు. అదొక స్థితి. అది వైజ్ఞానికతకు, తాత్వికతకు చిక్కదు. దాని పేరు సాధన. నిర్దుష్టమైన జీవన విధానం కచ్చితంగా పాటిస్తే తప్ప సాధనలోకి ప్రవేశించలేం.  మనిషిని, మనసుని, మతాన్ని, మత గ్రంథాల్నివేదాంతం ఖాతరు చేయదు. అలాంటి .. వేదాంతం పెట్టే వాతల్ని,  సాధకుడు ఒక్కడే భరించగలడు. ద్వంద ప్రవృత్తులు పనికి రావు:
మనసుదే నిరాశ. మనసులోదే ఈ నిరాశ. మరెక్కడిదో కాదు. మనసు ప్రయత్నిస్తుంది, ఓడిపోతుంది, నిరాశ పడుతుంది. ఇదొక పార్శ్వం. దీన్ని తరిమికొట్టాలని ఆశావాదం, సరియైన ఆలోచన  అనే పదాలు, పద్ధతులు తయారయ్యాయి. నిరాశను అనవసరంగా స్వాతంత్రము చేయడం వల్లనే ఇలాంటి అనవసరమైనవి వచ్చాయి. మనసు సంగతి తెలిసిన వాడికి వేటితోనూ పని లేదు.ప్రత్యేకంగా అవసరమూ లేదు. మనసు ‘తేడా’, ‘భేదం’ గుర్తిస్తున్నంత సేపూ మనకి నిరాశ అనుభవం అవుతూనే ఉంటుంది. ధ్యానమైనా, దారుణమైనా .. (మనసు) ఏ ప్రయత్నం చేస్తున్నా, నిరాశ పొంచి ఉన్నట్టే. అందుకే నైరాశ్యానికి గురవ్వని మనిషి ఉండడని చికాగోలో వివేకానందుడు చెప్పారు. జీవితాంతం తిరుగులేని విధంగా రోజులు గడపడం ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు .. సంయమనంతో జీవించడం ఆస్తికత్వం, అంటేనియమాన్ని  దాటకుండా జీవించడం. పోరాటంతో జీవించడం నాస్తికత్వం, అంటే తన ఆలోచనలు, సామర్థ్యం మేరకు జీవించడం. ఈ రెండు వాదనలూ మానసికమే. (అనుకోవడం, అనుకోకపోవడం తప్ప). అసలు జరిగేది ఏమిటో ఇద్దరికీ తెలియదు. అంటే ఆస్తిక, నాస్తికాల్లో ఏమీ లేదు. వాటిని అనుసరించే మనుషుల్లోని భావదోషమే ‘ఫలితాన్ని’ తారుమారు చేస్తుంది. ఎటువంటి భావదోషం లేకుండా మనసుని నడిపించడం ఏ మనిషికీ సాధ్యం కాదు. కానీ స్వచ్ఛమైన జీవనాన్ని సొంతం చేసుకున్న మనిషి వెంట ఈ మనసే కావలి కుక్కలా నడుస్తుంది.
జ్ఞానం అనేది వాస్తవి కతను గూర్చిన భావాలు, అభిప్రాయాలు, ప్రతిపాదనల సముదాయం. అంటే భౌతిక వాస్తవికతను, సత్యాన్ని,  ప్రతిబింబించేదిగా ఉన్న భావాలను జ్ఞానమంటాము. భౌతిక పదార్థానికి సంబంధించినదైనా, ఒక సంఘటన, విషయాని కీ సంబంధించినదైనా వాస్తవికమైనదీ, సత్యమై నదీ తెలిసి ఉండటం జ్ఞానం. తెలియకపోవటం అజ్ఞానం. జ్ఞానం అనేది సామాజిక ఆచరణ ఫలితం. ఆచ రణలోనే పరీక్షింపబడి, సరిదిద్దబడి, రూఢి చేయబడు తుంది. మొత్తం జ్ఞానం ఇంద్రియానుభూతులతో ఆరంభమై ఆచరణలో నిర్ధారించబడుతుంది. జ్ఞానం పరిపూర్ణమైనది కాదు. నిరంతరం విమర్శకు, మార్పుకు లోనై విస్తరిస్తుంది. ఒక విదంగా జ్ణాన మార్గం లో ఉన్న వారి కంటె భక్తి మార్గం లో ఉన్న వారే ఎక్కువుగా అలౌకిక అనందమయులుగా ఉంటారు. ఎందుకంటె జ్ణాన  మార్గం లో ఉన్నవారికి మల్లే "నీ మార్గం  గొప్పా? నా మార్గo గొప్పా? అనే వాదోపవాదాలు చేసుకోవడానికి వీరికి ఏ గురువు బోదలు గురించి కాని, గ్రంద సారాంశాలు గురించి అంతగా తెలియకపోవడం వలన తాము నమ్మినదే దైవమ్ అని భావిస్తూ  ఉండడం, సాద్యమైనంత వరకు  వేరే వారి భక్తి విశ్వాసాలు గురించి ఆలోచించకకపోవడం వలన వారు జ్ఞాన మార్గీయుల కంటే ఎక్కువుగా  అలౌకిక అనందాన్ని పోందుతున్నారని చెప్పవచ్చు.

Related Posts