YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

విద్యార్ధి ప్రతిభ

విద్యార్ధి ప్రతిభ

ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉన్నారు , వారు ఇద్దరు పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాలు కోసం వేచిచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది ఒకరు పాస్ అయ్యారు ఇంకొకరు ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వ్యక్తి పైచదువులకోసం పట్టణంలో ఉన్న  తన మామయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. 
ఫెయిల్ అయిన వ్యక్తిని అందరూ తిట్టడం , ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. వాడు ఎందుకు పనికిరాడు వాడి తల రాత అంతే అంటుంటే అది నిజమేనేమో అని ఆ విద్యార్ధి కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. వాళ్ళు అంటున్న మాటలని భరించలేక ఆత్మహత్య  చేసుకుందాం అని అనుకోని వాళ్ళ ఊరి చివరిలో ఉన్న చెరువులో దూకుదాం అని నిశ్చయించుకున్నాడు.
ఆ విద్యార్థి ఏడుస్తూ ఇంటి దగ్గర నుండి ఊరి చివర లో ఉన్న చెరువు దగ్గరికి బయల్దేరాడు. దారి మధ్యలో తన గురువు ఒకరు కనిపించి పలకరించారు. ఆ విద్యార్థి ఏడుస్తూ జరిగిన కథ మొత్తం చెప్పాడు. దానికి ఆ గురువు నవ్వుతూ అయ్యో ఇంత చిన్న దానికి ఎవరైనా ఏడుస్తారా ? దానికి ఆ విద్యార్థి , మీకు నా బాధ అర్ధం కావడం లేదు గురువు గారు నేను చచ్చిపోతా నేను బ్రతకలెను అని ఏడుస్తూ అన్నాడు.  అది తప్పు , ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం. నువ్వు  అలాంటి తప్పు చేయవద్దు అని గురువు తనను తిట్టాడు.నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో ఓడిపోయిన ప్రతిసారి చావే పరిష్కారం అంటే భూమి మీద ఒక్కరు కూడా ఉండరు , ఆఖరికి నేను కూడా ! ఏంటి గురువు గారు మీరు అనేది ? అని ఆ విద్యార్థి అడిగాడు.
అవును నేను కూడా పదవ తరగతి ఒకసారి ఫెయిల్ అయ్యాను , నీకన్నా ఎక్కువ ఏడ్చాను , నీకన్నా ఎక్కువ అవమానాలను అనుభవించాను కానీ చనిపోవాలి అని అనుకోలేదు. వాళ్ల అందరికి తగిన గుణపాఠం చెప్పాలి అనుకున్న ఆ ఓటమి నాలో చాలా పట్టుదలని తెచ్చింది. అదే పట్టుదలతో ఇంత స్థాయికి ఎదిగాను కొన్ని  వేల మందికి పాఠాలు చెప్పి వాళ్ళ భవిష్యత్తుకి బాటను అయ్యాను.
" మనిషి పుట్టుకె  గెలుపుతో మొదలవుతుంది".
"పుట్టిన తర్వాత వచ్చిన ఓటమికి బయపడితే ఎలా ?" 
ఆ కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్ళు మళ్ళీ ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు , "ఓటమి కూడా నీచేతిలో ఓడిపోయేంత వరకు ప్రయత్నించు."
ఆ మాటలు విన్న విద్యార్థి మళ్ళీ పరీక్ష రాసాడు. ఈ సారి అత్యధిక మార్కుల తో జిల్లా ఫస్ట్ వచ్చాడు. అదే పట్టుదలతో జీవితంలో ఎన్నో సాధించాడు. ఒక సంస్థ కూడా ప్రారంభించాడు, ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఒక రోజు అతని దగ్గరికి ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వచ్చాడు. ఆ వ్యక్తి ఇంకేవరో కాదు తన కంటే ముందుగా పదవ తరగతి పాస్ అయ్యి పట్టణం కి వెళ్లిన తన చిన్ననాటి స్నేహితుడు. ఇప్పుడు అతనే తన దగ్గరికి ఉద్యోగం కోసం రావడం  అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. 
నా చిన్నప్పుడు తీసుకున్న నిర్ణయం నిజమయితే ఇప్పుడు ఈ సంతోషం నాకు దక్కేది కాదు అని తన లో తాను నవ్వుకుంటూ అతనికి ఉద్యోగాన్ని ఇచ్చాడు. మిత్రమా , జీవితం అంటే ఏంటో ఎవరికి తెలియదు , నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండదు , ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. పూట  పూటకి మారిపోయే దానికి నీ జీవితాన్ని బలి ఇవ్వాలి అని చూస్తే  నీకన్నా  మూర్ఖుడు ఇంకా ఎవరు ఉండరు. ఏదైనా పోరాడి సాధించుకోవాలి అలా కాకుండా  జీవితంలో  ఓడిపోయాం అని , స్నేహితులు మోసం చేశారు అని ,  ప్రేమించినవాళ్ళు వదిలేసి వెళ్లిపోయారు అని , పరీక్ష ఫెయిల్ అయ్యాం అని ప్రతి చిన్నదనికి చచ్చిపోదాం అనుకుంటే ఎలా?నువ్వు పుట్టింది చవడానికి కాదు ,  నీకంటూ చరిత్రలో ఒక గుర్తింపు తెచ్చుకో ,  లే  లేచి  పోరాడి సాదించుకో , నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళకే నువ్వు ఆదర్శంగా మారి నీ ప్రతిభ ఏంటో వాళ్లకి చూపించు.

Related Posts