YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

హిట్ వికెట్ గా అజార్

హిట్ వికెట్ గా అజార్

హైదరాబాద్, మార్చి 31, 
భారీ మెజారిటీతో గెలిచినా సీన్‌ రివర్స్‌ కావడానికి ఎంతో కాలం పట్టలేదు. నాడు జిందాబాద్‌ అన్నవాళ్లే నేడు ముర్దాబాద్‌ అనే పరిస్థితి. అన్నీ బౌన్సర్లే. హిట్‌ వికెట్‌ తప్ప మరో ముచ్చట లేదు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అజారుద్దీన్‌ చుట్టూ జరుగుతున్న గొడవలే తాజా చర్చకు కారణం. ఇంతకీ హెచ్‌సీఏ  పరిణామాలు ఏం చెబుతున్నాయిఅజారుద్దీన్‌...! టీం ఇండియా మాజీ కెప్టెన్‌. హైదరాబాదీ క్రికెటర్‌. అజ్జూభాయ్‌ని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రావాలని క్రికెట్‌ సంఘాలన్నీ అప్పట్లో కోరుకున్నాయి. సిటీలోని క్రికెట్‌ క్లబ్బులన్నీ ఏకమై.. అజార్‌ను హెచ్‌సీఏ  ప్రెసిడెంట్‌గా భారీ మెజార్టీతో గెలిపించాయి కూడా.  ఆ తర్వాత పెనుమార్పులు వస్తాయని అంతా భావించారు. కానీ.. అజార్‌ను ఎన్నుకున్నవాళ్లకు తోడు.. ఊహించని పరిణామాలు జరుగుతుండటంతో హెచ్‌సీఏ  చరిత్ర మసకబారే ప్రమాదం కనిపిస్తోంది. అజార్‌  వెన్నంటి ఉన్నవాళ్లే ఇప్పుడు హ్యాండిచ్చారు. ఆయన సొంత ప్యానల్‌ నుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అజార్‌ అవునంటే.. మిగతావాళ్లు నో చెబుతున్నారు. ప్రతి విషయంలోనూ ఇదే రియాక్షన్‌ కనిపిస్తోంది. హెచ్‌సీఏ  సెక్రటరీగా ఉన్న విజయానంద్‌కి, అధ్యక్షుడు అజారుద్దీన్‌కి మధ్య వైరం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. నాటి ఎన్నికల్లో అజ్జూభాయ్‌ మద్దతుతోనే  సెక్రటరీగా గెలిచారు విజయానంద్‌. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. ఇటీవల నిర్వహించిన హెచ్‌సీఏ  సమావేశంలో ఇద్దరూ వేదికపైనే వాగ్వాదానికి దిగారు. వెంటనే మిగతా సభ్యులు సైతం అజార్‌పై విరుచుకుపడటంతో తీవ్ర గందరగోళానికి దారితీసింది. మొత్తానికి నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
సర్వసభ్య సమావేశానికి తెలంగాణలోని అన్ని జిల్లాల క్రికెట్‌ అసోసియేషన్ల సభ్యులు హాజరయ్యారు. జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఏం చేశారో చెప్పాలని అజార్‌ను నిలదీశారు. ప్రెసిడెంట్‌ పదవికి అనర్హుడని కొందరు.. ఆ పోస్ట్‌ నుంచి తప్పుకోవాలని మరికొందరు నినదించారు. ఆ సమయంలో అజార్‌కి మద్దతుగా ఒక్కగళం వినిపించలేదు. గొడవ చేస్తున్నవారిని వారించే ప్రయత్నం జరగలేదు. పైగా ఈ మొత్తం ఎపిసోడ్‌ను అక్కడే ఉండి చూస్తున్నవారు ఎంజాయ్‌ చేసిన పరిస్థితి.

Related Posts