YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం దేశీయం

భారీగా తగ్గనున్న సిలెండర్ ధరలు

భారీగా తగ్గనున్న సిలెండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ వాడే వారికి తీపికబురు అందబోతోందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగిరావొచ్చనే అంచనాలు కారణమని తెలిపాయి.రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలుదిగిరానున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇప్పుడు వీటి ధరలు తగ్గుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశముందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల తగ్గుదల బెనిఫిట్‌ను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని వివరించారు.ఇకపోతే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏప్రిల్ నెలలో రూ.10 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్ల తగ్గుదల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే గ్యాస్ సిలిండర్ ధర దిగివచ్చింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809 వద్ద ఉంది.అదే మన ఊరిలో అయితే ఎల్‌పీజీ సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ.900 చెల్లించుకోవాల్సిందే. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.125 మేర పైకి కదిలింది. పెరగడం భారీగా పెరిగింది కానీ.. తగ్గడం మాత్రం కేవలం రూ.10 మాత్రమే కావడం గమనార్హం.

Related Posts