YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇప్పుడు టార్గెట్ చైనా...

ఇప్పుడు టార్గెట్ చైనా...

న్యూఢిల్లీ, జూలై 8, 
ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో జర్మనీ దేశాన్ని పక్కన పెట్టాం. మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. భవిష్యత్ కాలంలో చైనాను అధిగమించబోతున్నాం. అమెరికాకు దగ్గరగా వెళ్లబోతున్నాం.. ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదు.. రక్షణ పరంగా కూడా అంతే స్థాయిలో వృద్ధిని సాధించబోతున్నాం. ఇదేదో అడ్డగోలుగా చెబుతున్న మాట కాదు. సరదాగా చేస్తున్న వ్యాఖ్య అంతకన్నా కాదు. ఇటీవల పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ తర్వాత మన సైనిక సామర్థ్యం.. మన ఆయుధ సామర్థ్యం.. ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా యుద్ధ విమానాలను వాడటంలో మనం ఉపయోగిస్తున్న సాంకేతికత ప్రపంచానికి సరికొత్తగా కనిపించింది. అయితే దీనిని ఇక్కడితోనే ఆపివేయాలని భారత ప్రభుత్వం అనుకోవడం లేదు. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను భారతదేశం నిర్మించుకుంటున్నది.ఇప్పటికే డిఆర్డిఓ అత్యంత ఆధునికమైన ఆయుధాలను తయారు చేస్తున్నది. వచ్చే ఐదు సంవత్సరాలలో వివిధ రకాల 12 హైపర్ సోనిక్ యుద్ధ క్షిపణులు సిద్ధమవుతున్నాయి. ఇవి దాడి చేయడం మాత్రమే కాదు.. శత్రు దేశాల రక్షణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రాజెక్టు విష్ణు లో భాగంగా డిఆర్డిఓ ఈ మిషన్ చేపడుతోంది.. డిఆర్డిఓ చేపడుతున్న మిషన్ లో హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్, హైపర్ సోనిక్ క్రూజ్ మిస్సైల్స్, హైపర్ సోనిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. దాడిలో అత్యంత వేగవంతమైన సామర్థ్యం.. అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం వీటిలో ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా శత్రువులను అత్యంత బలంగా ఎదుర్కోవడం.. వెంటనే తుద ముట్టించడం వీటి లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు.సరిగ్గా ఏడాది క్రితం డిఆర్డిఓ హైపర్ సోనిక్ మిస్సైల్ పరీక్షను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా దేశ స్క్రామ్ జెట్ ఇంజన్ అభివృద్ధిలో ఇది కీలకమైన రాయిగా నిలిచింది.. అంతేకాదు ఈ వ్యవస్థలను అభివృద్ధి చేసి చైనా, రష్యా, అమెరికా స్థాయిలో భారత్ నిలిచింది. లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కెపాసిటీ ఉన్న మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ లో మన దేశం ఒకటిగా నిలిచింది. ధ్వని కంటే ఐదు రెట్ల వేగంతో ప్రయాణించే కెపాసిటీ ఉన్న ఆయుధాలను హైపర్ సోనిక్ అని పిలుస్తుంటారు. ఇలాంటి క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం వద్ద లేదు. అయితే ఇటువంటి అత్యాధునిక హైపర్ సోనిక్ వెపన్స్ ను డిఆర్డిఓ డెవలప్ చేస్తోంది. వీటిని ఆర్మీ, నేవి, వాయు సేన కోసం డెవలప్ చేస్తోంది.ఇందులో ఫస్ట్ టైం ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను డిఆర్డిఓ డెవలప్ చేస్తోంది. స్క్రామ్ జెట్ ఇంజన్ తో మాక్- 8 స్పీడ్ ను రీచ్ అయ్యే విధంగా దీనిని డెవలప్ చేస్తున్నారు. ఇది 2,500 కిలోమీటర్ల వరకు ఉన్న టార్గెట్ లను చేజ్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు 2030 కల్లా వీటిని మన ఆర్మీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆయుధాలు మన ఆర్మీకి ఐదు సంవత్సరాల కాలంలో అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా మన దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. అప్పుడు శత్రు దేశాలు మన మీద దాడి చేయాలంటే ఆలోచిస్తాయి. అంతేకాదు బలమైన దేశాల కంటే మనమే ముందు వరుసలో ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ వ్యవస్థలో అమెరికాతో సమానంగా ఉంటాం.

Related Posts