YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ధనుర్మాసం మార్గశిర బహుళ త్రయోదశి శనివారం

ధనుర్మాసం మార్గశిర బహుళ త్రయోదశి శనివారం

- డిశంబర్ 16వ తేదీ నుంచి ఆరంభమౌతుంది

- ధనుర్మాసం 'పండుగ నెల' ధనుర్మాస వ్రతం

 ఉషఃకాల వ్రతంగా దీనిని వివరించారు. కేవలం విష్ణుపరంగానే మన తెలుగునాట ప్రాచుర్యం ఉన్నప్పటికీ శాస్త్రానుసారం సర్వదేవతా ప్రీతికరమైనది ధనుర్మాసం. శైవ, వైష్ణవ – ఉభయ శాస్త్రాల్లోనూ విశిష్టంగా పేర్కొన్నారు
గోపెమ్మలు ఆచరించిన మార్గశీర్ష వ్రతాన్ని తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో జన్మించిన గోదాదేవి ' తిరుప్పావై' - శ్రీకరమైన పద్యాల సమాహారం - పాశురాలుగా రచించి అలరించింది. శ్రీ మహాలక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి విష్ణు చిత్తుడు అనే మహనీయుని కుమార్తెగా జన్మించి విష్ణుదేవుని రూపమైన శ్రీరంగనాథుని వివాహమాడింది.
ఈ వివాహం సిద్ధించడం కోసం గోదాదేవి తన సఖీ బృందంతో కలిసి ధనుర్మాసంలో రోజుకొక పాశురాన్ని పాడింది. ద్వాపరయుగం నాటి గొబ్బెమ్మలు లేదా గోపెమ్మలు కలియుగంలో గోదాదేవి బృందం.
గోపెమ్మలు తెల్లవారు జామున నిద్రలేచి ఒకరినొకరు నిద్రలేపుకుంటూ వెళ్ళి నందుని ఇంట నిదురించి ఉన్న శ్రీకృష్ణుని నిద్రలేపి పూజించడం 'తిరుప్పావై'లోని ఇతివృత్తం. ఇంటిముందు గొబ్బెమ్మలను నిలిపి కన్యలు – శ్రీకృష్ణుని గురించి పాడడం – మంచి భర్తను పొందడం కోసం. 
• ఈ మాసంలో ఆర్ద్రానక్షత్రం నాడు శివుడు అగ్నిలింగంగా అరుణాచలంలో వ్యక్తమైనాడని శైవపురాణాలు చెప్తున్నాయి.
• ఈ మాసంలోని ఒకానొక సోమవారం నాడు శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివపురాణ వచనం.
• ఉషఃకాలంలో శివార్చన వైశిష్ట్యాన్ని కూడా పురాణాలు పేర్కొన్నాయి. అత్యంత ప్రాచీన కాలం నుండి నేటివరకు వైదిక శైవ సిద్ధాంతానుసారం తమిళనాట శైవాలయాలలో ఉషఃకాల పూజ జరుగుతోంది. ఆ సమయంలో మాణిక్యవాచకుని ‘తిరువెంబావై-తిరుప్పళి ఎళుచ్చి’పఠనం చేయడం కూడా ఆనవాయితీ.
అయితే వైష్ణవం కూడా శ్రీరామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది ‘తిరుప్పావై’ ఇక్కడి వైష్ణవాలయాలలో పారాయణ చేయడం అలవాటు అయింది. కానీ ఆ ప్రచార ధాటిని తమిళ శైవమతం అవలంబించకపోవడం చేత –ఇక్కడి శివాలయాలకు ‘తిరువెంబావై’ తెలియలేదు. 
తిరుప్పావై, తిరువెంబావై రెండూ అవశ్య పఠనీయాలుగా ప్రస్తావించి వ్యాప్తి చేసినది కాంచీ పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు. ఆ మహాస్వామి వారి చరణాలను ధ్యానిస్తూ వారి హృదయానుసారం ఈ ఉభయ గ్రంథాలను ఈ ధనుర్మాస సమయంలో పారాయణ చేసుకుందాం.

Related Posts