YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఎన్ఐఆర్ఎతో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒప్పందం

ఎన్ఐఆర్ఎతో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒప్పందం

బెంగళూరు ఏప్రిల్ 14,
తన డిజిటల్ పరిధిని మరింత బలోపేతం చేసుకొనే వ్యూహంలో భాగంగా ఫిన్‌టెక్ ఎన్‌ఐఆర్ఎతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ రోజు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా, వేతనదారులైన వినియోగదారులు ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఎన్ఐఆర్ఎ యాప్‌ను ఉపయోగించి వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఎన్ఐఆర్ఎ బెంగళూరు కేంద్రంగా ఉన్న ఒక ఫిన్‌టెక్, ఆదాయాలు తక్కువగా అంటే నెలకు రూ. 11 వేల రూపాయల వేతనాలు ప్రారంభమయ్యే వేతన తరగతికి నిధులు సమకూర్చడానికి ఇది సాయపడుతుంది. ఆన్-బోర్డ్  వినియోగదారులకు వ్యక్తిగత రుణాల కోసం ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బికి ఈ భాగస్వామ్యం సాయపడుతుంది.ఈ పరిణామం గురించి శ్రీ ధీమత్ థాకర్, అధిపతి- డిజిటల్ బ్యాంకింగ్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మాట్లాడుతూ “మేము నిరంతరం నవ్యావిష్కరణలు చేసి, మా డిజిటల్ విస్తరణను వేగవంతం చేయడం కోసం వాటిని ఉత్పత్తులు, సేవలు, ప్రక్రియలలోకి తీసుకువస్తాం. ఆర్థిక పర్యావరణ వ్యవస్థలో, ప్రత్యేకించి, మాస్ మార్కెట్‌కు సేవలు అందించడంలో ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మా వినియోగదారులను ఉత్తమమైన ప్రొడక్ట్స్ తో చేరుకోవడానికీ, సులువైన, సౌకర్యవంతమైన సేవలు అందించడానికీ ఇలాంటి భాగస్వామ్యాలు దోహదపడతాయి” అని తెలివారు.బ్యాంకింగ్, ఆర్థిక సేవలలకు సంబంధించి సేవలు అందని, సేవలు సరిగ్గా అందని వారికి సేవలు అందించడం మీద ఉజ్జీవన్ ఎస్‌ఎఫ్‌బి దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రత్యేకించి ఈ విభాగానికి సంబంధించిన నిర్దిష్టమైన అవసరాలను గుర్తించి, పరిష్కరించే భాగస్వామ్యం కోసం ఫిన్‌టెక్‌లను బ్యాంకు ఎంపిక చేసుకుంటోంది.ఎన్ఐఆర్ఎ సిఇఓ, సహవ్యవస్థాపకుడు రోహిత్ సేన్ మాట్లాడుతూ “కొవిడ్ సంక్షోభాలను చాలా ఉత్తమంగా దాటిన తరువాత, భారతదేశంలోని పట్టణ మాస్ మార్కెట్‌కు రుణాలు అందుబాటులోకి తేవాలన్న మా లక్ష్యం మీద తిరిగి దృష్టి కేంద్రీకరించాం. ఈ గ్రూప్ నించి క్రెడిట్ స్కోరింగులో, సేకరణలో మేము గట్టి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాం, ఉజ్జీవన్ లాంటి బ్యాంకుల భాగస్వామ్యంతో, ఈ విభాగానికి సమయానుసారంగా సరైన ఉత్పత్తులను మేము అందించగలం” అని చెప్పారు.

Related Posts